`పుష్ప - ది రైజ్` హిందీ వసూళ్లు హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో రాని వసూళ్లను ఉత్తరాది నుంచి సాధించింది ఈ చిత్రం. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద 7వారాలు ఆడింది. ఏడవ వారం చివరిలో దేశీయ బాక్సాఫీస్ వద్ద పుష్ప వసూళ్లు తగ్గాయి.
అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ - పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద తిరుగులేని హవా సాగించింది. హిందీలో ఒక మోస్తరు ప్రారంభం తర్వాత పుష్ప వసూళ్లు తదుపరి వారాల్లో విపరీతమైన వృద్ధిని సాధించాయి. విడుదలైన 45 రోజుల్లో 100కోట్లు వసూలు చేసింది. వాస్తవానికి ఈ చిత్రం అద్భుతమైన విజయం ప్రేక్షకులను వ్యాపార వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. అయితే గొప్ప వీక్షణ అనుభూతిని అందించే సినిమాకి ఆదరణ దక్కుతుందని రుజువు చేసింది.
ఇప్పుడు దాదాపు దాని థియేట్రికల్ రన్ ముగింపులో ఉంది. OTT విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను తరచుగా థియేటర్లకు రప్పించిన సినిమాగా పుష్ప సత్తా చాటాడు. ఈ చిత్రం ఇప్పటివరకూ ఘనంగా ఆడిందని హిందీ ట్రేడ్ వెల్లడించింది.
హిందీ బాక్సాఫీస్ రిపోర్ట్ పరిశీలిస్తే.. పుష్ప: ది రైజ్ ఏడవ వారం చివరి వరకూ కొనసాగింది. ప్రాంతాల వారీగా డేటా పరిశీలిస్తే షాకిచ్చే లెక్కలు తేలాయి. బాక్సాఫీస్ వద్ద పుష్ప మొత్తం కలెక్షన్లకు ముంబై సర్క్యూట్ అత్యధికంగా అందించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు రూ. 40.22 కోట్లు ఒక్క ముంబై నగరం నుండి వసూలైంది. ముంబై తర్వాత ఢిల్లీ-యూపీ ప్రాంతం రూ. 14.4 కోట్లు అందించింది. CP (సెంట్రల్ పంజాబ్) రూ. 13.12 కోట్లు.. పశ్చిమ బెంగాల్ నుంచి రూ. 5.04 కోట్లు వసూలు చేసింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పుష్ప హిందీ డబ్బింగ్ వెర్షన్ బీహార్ & జార్ఖండ్ వంటి మాస్ డామినేటెడ్ ఏరియాల్లోనూ అద్భుతాలు సృష్టించగలిగింది. రూ. 4.69 కోట్లు అక్కడి నుంచి వసూలు చేసింది. రాజస్థాన్ లో రూ. 4.63 కోట్లు,.. ఈస్ట్ పంజాబ్ నుంచి రూ. రూ. 4.59 కోట్లు వసూలైంది. ఒరిస్సా- మధ్యప్రదేశ్- అస్సాం వంటి అంతగా ప్రాధాన్యత లేని ప్రాంతాలు కూడా మంచి కలెక్షన్ లను అందించాయి. వాటి వివరాలు పరిశీలిస్తే అక్కడి నుంచి వరుసగా రూ. 4.47 కోట్లు, .. రూ. 3.36 కోట్లు మరియు రూ. 1.27 కోట్లు వసూలయ్యాయి. టోటల్ కలెక్షన్ ఉత్తరాది నుంచి లెక్కిస్తే రూ. 100.88 కోట్లు కలెక్ట్ అయ్యింది. పుష్ప: ది రైజ్ 2021లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా చరిత్ర సృష్టించింది. వాస్తవానికి కోవిడ్ పరిమితులను ఎత్తివేసి ఉంటే పుష్ప మొత్తం కలెక్షన్లు చాలా ఎక్కువగా ఉండేవని ట్రేడ్ పేర్కొంది. ఆల్మోస్ట్ 200 కోట్లు ఉత్తరాది నుంచి వసూలు చేయగలిగేదన్న అంచనా ఉంది.
ఉత్తరాది నుంచి పుష్ప దులుపుడు ఇదీ
ముంబై - 40.22 కోట్లు
ఢిల్లీ-యు.పి - 14.4 కోట్లు.
తూర్పు పంజాబ్ - 4.59 కోట్లు.
CP - 13.12 కోట్లు
మధ్య ప్రదేశ్ - 3.36 కోట్లు
రాజస్థాన్ - 4.63 కోట్లు.
పశ్చిమ బెంగాల్ - 5.04 కోట్లు.
బీహార్ మరియు జార్ఖండ్ - 4.69 కోట్లు.
అస్సాం - 1.27 కోట్లు
ఒరిస్సా - 4.47 కోట్లు