హీరో మీద అభిమానం ఉంటే ఫస్ట్ డే ఫస్ట్ డే సినిమా చూస్తాు. థియేటర్ దగ్గర బేనర్ కడతారు. పాలాభిషేకాలు చేస్తారు. హీరోను కలిసే అవకాశం వస్తే పూల దండ వేయడమో.. ఏదైనా గిఫ్ట్ ఇవ్వడమో చేస్తారు. కానీ బరోడాకు చెందిన నిషి హరిశ్చంద్ర త్రిపాఠి అనే మహిళ తన అభిమాన కథానాయకుడికి తన విలువైన ఆస్తిని రాసిచ్చేసింది. 62 ఏళ్ల నిషి ఇటీవలే మృతి చెందింది. ఆమెకు బరోడాలోని ఒక బ్యాంకు బ్రాంచిలో లాకర్ ఉంది. అందులో భారీ మొత్తంలో నగదు, విలువైన వస్తువులు ఉన్నాయి. అదంతా తన అభిమాన కథానాయకుడి సంజయ్ దత్ కు చెందేలా విల్లు రాసి పెట్టి నిషి చనిపోవడం గమనార్హం.
త్రిపాఠి ఎవరో సంజయ్ దత్ కు తెలియనే తెలియదట. అతడిని ఎప్పుడూ కలిసినట్లు కూడా గుర్తు లేదట. ఐతే బ్యాంకు అధికారులు ఫోన్ చేసి లాకర్ స్వాధీనం చేసుకోవాలని సంజయ్ దత్‌కు చెప్పేసరికి ఆయన అవాక్కయ్యాడు. ఇలాంటి అభిమానులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయాడు. నిషి కుటుంబ సభ్యులకు కూడా ఇది షాకింగ్ గానే ఉంది. సంజయ్ దత్ కు విషయం తెలివాక నిషి కుటుంబ సభ్యులతో అతను మాట్లాడినట్లు తెలిసింది. సంజయ్ బరోడాకు వెళ్లి తనకు చెందేలా రాసిన లాకర్ నిషి కుటుంబ సభ్యులకు చేరేలా లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేయాల్సి ఉంది. ‘‘అభిమానులు మా మీద అభిమానంతో తమ పిల్లలకు మా పేర్లు పెట్టుకోవడం.. బహుమతులు ఇవ్వడానికి వెంట పడటం చూస్తుంటాం. కానీ నిషి నాకు పెద్ద షాకిచ్చింది. ఆమె ఇచ్చింది ఏదీ నేను తీసుకోను’’ అని సంజయ్ అన్నాడు.