నటసింహ నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను హ్యాట్రిక్ ట్రయల్స్ గురించి సంగతి తెలిసిందే. సింహా-లెజెండ్ తర్వాత మూడో సారి కలిసి పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. బాలయ్య `రూలర్` చిత్రీకరణ ముగించి బయటకు రాగానే బోయపాటి సినిమా పట్టాలెక్కనుంది. ఇందుకు కేవలం మరో రెండు నెలలు సమయం పట్టనుందట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. బోయపాటి సీరియస్ గా బాలయ్యకు హీరోయిన్ సహా విలన్ ని వెతికే పనిలో బిజీ అయ్యాడట. నాయికతో పాటు విలన్ ఎంపిక లో బోయపాటి దిట్ట. హీరో ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా ధీటైన క్యాస్టింగ్ సెలక్షన్ ఉంటుంది. కథ ఎంత బలంగా ఉంటుందో...అందులో పాత్రలు అంతే బలంగా ఉంటాయి. నటీనటుల్ని క్రేజు ఉన్నవాళ్లనే ఎంపిక చేస్తారు.
మరోసారి హ్యాట్రిక్ కోసం హీరోకి ధీటుగా విలన్ పాత్రని అంతే బలంగా రాసుకున్నాడట. ఈ నేపథ్యంలో బాలయ్య విలన్ విషయంలో ఓ ఆసక్తికర రూమర్ వెలుగులోకి వచ్చింది. నటసింహ కోసం బోయపాటి ఏకంగా బాలీవుడ్ దాదా సంజయ్ దత్ నే రంగంలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నాడుట. ప్రస్తుతం ఆ విషయంపైనే బోయపాటి సీరియస్ గా సంప్రదింపులు జరుపుతున్నాడని సమాచారం. అదే గనుక నిజమైతే బాలయ్య సినిమా నెక్స్ట్ లెవల్లోనే ఉంటుంది.
బాలయ్య తో మున్నాభాయ్ ఢీ కొడితే ఎలా ఉంటుందో? నందమూరి ఫ్యాన్స్ ఊహకే అందదు. ప్రస్తుతం సంజయ్ దత్ కేజీఎఫ్-2లో విలన్ పాత్ర అధీరాగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతోన్న చిత్రమిది. మరి ఈ ఇన్ పుట్ ఆధారంగా దత్ ని తీసుకోవాలన్న ఆలోచన బోయపాటికి ఐడియా వచ్చిందా? లేదూ ఆ పాత్ర స్థాయి అంతుందా? అన్నది తెలియాల్సి ఉంది. గతంలో `వినయ విధేయ రామ` లో చరణ్ ని ఢీ కోట్టడానికి బాలీవుడ్ నుంచి వివేక్ ఓబెరాయ్ ని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే