మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఆరంభంలో విలన్ పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’.. ‘47 రోజులు’.. ‘పున్నమి నాగు’ లాంటి సినిమాల్లో ఆయన నెగెటివ్ రోల్స్ తో అదరగొట్టారు. అప్పట్లో చిరంజీవిని అలా చూసిన వాళ్లు ఆయన విలన్ గానే కొనసాగుతాడని అనుకున్నారు. కానీ చిరు హీరోగా మెప్పించాడు. అంచెలంచెలుగా ఎదిగి తిరుగులేని స్థాయికి చేరుకున్నాడు. ఐతే కెరీర్ ఆరంభంలో చిరు చేసిన రోల్స్ చూసి తాము చిరంజీవి పెద్ద విలన్ అవుతాడని అంచనా వేసినట్లు సీనియర్ నటుడు మురళీమోహన్ తెలిపాడు. ఐతే చిరు తమ అంచనాలకు భిన్నంగా హీరోగా తిరుగులేని ఇమేజ్ సంపాదించాడని మురళీ మోహన్ అన్నాడు.
కెరీర్ ఆరంభంలో చిరు ఒకసారి తనను కలిసి మీ సినిమాకు వచ్చినట్లే నా సినిమాకూ జనాలు వస్తారా అని అడిగాడని.. టాలెంట్ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా జనాలు చూస్తారని చెప్పానని మురళీ మోహన్ తెలిపాడు. తర్వాత ఓ సందర్భంలో కృష్ణం రాజు.. తాను చిరంజీవి గురించి మాట్లాడుకున్నామని.. చిరంజీవికి మంచి కళ్లున్నాయని.. భవిష్యత్తులో నటుడిగా మంచి పేరు సంపాదిస్తాడని.. పెద్ద విలన్ అవుతాడని ఆయన అన్నారని.. ఐతే చిరంజీవి ఇండస్ట్రీకే రంకు మొగుడు అయ్యాడని మురళీ మోహన్ చమత్కరించారు. చిరు రియల్ ఫైట్లు.. రియల్ డ్యాన్సులతో ఇండస్ట్రీలో పెద్ద మార్పులకు తెర తీశాడని.. ఆ తర్వాత తాము కూడా అలాగే చేయాల్సిన పరిస్థితి కల్పించాడని మురళీ మోహన్ అన్నాడు.