ఇండస్ట్రీకి పెద్దన్న.. పెద్దదిక్కు అన్ని ఆయనే

Update: 2021-06-28 05:30 GMT
సినిమా పరిశ్రమలో ఏ అలజడి మొదలైనా.. ఏ సమస్య వచ్చినా మరేదైనా ఇబ్బందులు కలిగినా కూడా నేను ఉన్నాను అంటూ ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించడం.. ఆ అలజడిని చల్లార్చే ప్రయత్నాలు చేయడం.. ఇబ్బందుల్లో ఉన్న పేద కళాకారులను ఆదుకోవడం వంటివి చేసే వారినే పెద్ద దిక్కు అంటున్నారు. దాసరి నారాయణ రావు గారు ఉన్న సమయంలో ఆయన పద్దతి కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఆయన పెద్ద దిక్కుగా ఉండే వారు. ఆయన సమస్యల పరిష్కారంకు చొరవ చూపించే ప్రయత్నాలు చేసేవారు. ఆయన పోయిన తర్వాత ఆ స్థానంను మెగాస్టార్‌ చిరంజీవి గారు తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. కొందరు చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటే ఒప్పుకోక పోవచ్చు. కాని ఎవరు ఏమన్నా కూడా చిరంజీవి గారే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటూ సీనియర్ నటుడు.. రాజకీయ నాయకులు మురళి మోహన్‌ అన్నారు.

ఇటీవల ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విపత్తు సమయంలోనే కాకుండా ఎన్నో సందర్బాల్లో కూడా ఇండస్ట్రీకి ఆయన అందిస్తున్న ధైర్యం మరియు చేస్తున్న సేవను ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిందే. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ సాయం అందిస్తున్నాను. తనవంతు సహకారంను సమస్యల పరిష్కారంకు అందించడంతో పాటు పలు విషయాల్లో సలహాలు సూచనలు చేస్తున్నారు. కరోనా సమయంలో సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క పేద కళాకారుడి గురించి తపన పడి వారికి నిత్యావసరాలు సరఫరా చేయడం మొదలుకుని వ్యాక్సిన్‌ ఇప్పించడం వరకు ప్రతి విషయంలో కూడా ఆయన గొప్ప మనసును చాటుకుంటున్నారు. అందుకే ఆయన ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ అన్నారు.

దాసరి గారు బతికి ఉన్నంత కాలం ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తూ ఎన్నో సమయాల్లో ఆయన గాడ్‌ ఫాదర్ గా వ్యవహరించారు. ఆయన ప్రతి విషయంలో తన చొరన చూపించి మరీ సమస్యల పరిష్కారంకు మార్గం సుగమం చేసేవారు. ఆయన గాడ్ ఫాదర్ గా ఇండస్ట్రీకి తోడుగా ఉంటూ వచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత ఇండస్ట్రీకి ఖచ్చితంగా మెగాస్టార్‌ చిరంజీవి గారు మాత్రమే గాడ్‌ ఫాదర్‌ అంటూ మురళి మోహన్‌ బల్ల గుద్ది మరీ చెప్పారు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా కూడా అందరు కూడా ఇప్పుడు మెగాస్టార్‌ వైపే చూస్తున్నారు. మా ఎన్నికల విషయంలో కూడా చిరంజీవి మాట కోసం అంతా ఎదురు చూస్తున్నారు. కనుక చిరంజీవి గారే ఇండస్ట్రీకి పెద్దన్న.. పెద్ద దిక్కు అంటూ అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News