ఏడేళ్ల నుంచి నందులు లేవు సింహాలు లేవ్!-ముర‌ళీ మోహ‌న్

Update: 2022-04-03 04:51 GMT
అవార్డులు ఎంతో ప్రోత్సాహ‌కం. ఆర్టిస్టుల‌కు కానీ సినీప‌రిశ్ర‌మ‌లో 24 శాఖ‌ల ప్ర‌తిభావంతుల‌కు ప్ర‌తియేటా అవార్డులిచ్చే గొప్ప సంస్కృతి ఉండేది. కానీ ఇప్పుడు అంతా మారింది. అవార్డుల‌ను ప‌ట్టించుకునే స‌న్నివేశం లేదు. ప్ర‌భుత్వాలు రాజ‌కీయ‌నాయ‌కుల‌కు అంత తీరిక కూడా లేదు. ముఖ్యంగా రాష్ట్రం రెండుగా విభ‌జిత‌మ‌య్యాక స‌న్నివేశం మ‌రీ తీసిక‌ట్టుగా మారింది. అస‌లు ప్ర‌భుత్వం త‌ర‌పున ఇచ్చే అవార్డుల గురించి మాట మాత్రం అయినా ప్ర‌స్థావ‌న లేదు.

అప్ప‌ట్లో ఘ‌నంగా ప్ర‌క‌టించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నంది అవార్డుల‌ను కొన‌సాగిస్తుంటే.. తెలంగాణ‌లో సింహా అవార్డులు ఇస్తామ‌ని పేర్కొన్నారు. కానీ ఇప్ప‌టికీ అవార్డుల‌కు టికాణా లేక‌పోవ‌డంతో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సినీప‌రిశ్ర‌మ ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో చెప్పేందుకు తాజాగా ముర‌ళీ మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ప‌రిశీలించాలి.

``ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పుడు దయ కలుగుతుందో అవార్డులు ఇవ్వడానికి..`` అంటూ  ప్రసాద్ ల్యాబ్ లో ఉగాది సినిమా పురస్కారాల వేడుకలో మురళీ మోహన్ వ్యాఖ్యానించారు. 24 విభాగాలకు చెందిన సినీ ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అంద‌జేస్తూ సినీప్ర‌ముఖులే ఒక కార్య‌క్రమం జ‌రుపుకున్నారు మిన‌హా ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకున్న‌దే లేదు. ముఖ్య అతిథులుగా హాజరైన బ్రహ్మానందం- సి.కళ్యాణ్ - ముర‌ళీమోహ‌న్ ప్రభృతుల్లో దీనిపై విస్త్ర‌త చ‌ర్చ సాగింది.

సినీనటులకు అవార్డులు ఆక్సిజన్ లాంటివి అని ప్ర‌భుత్వాలు స‌హ‌క‌రించాల‌ని మ‌రోసారి మురళీమోహన్ గోడు వెల్ల‌బోసుకున్నారు.
నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టాయని కూడా మురళీమోహన్ వ్యాఖ్యానించారు. ఏడేళ్ల నుంచి నంది అవార్డులు ఇవ్వడం లేద‌ని అన్నారు. ప్రైవేటు సంస్థలు నటీనటులకు అవార్డులు ఇస్తున్నాయి త‌ప్ప ప్ర‌భుత్వాల‌కు తీరిక లేనేలేద‌ని అన్నారు.

స్టూడియో సెక్టార్ నుంచి రమేష్ ప్రసాద్ కు ఉగాది పురస్కారాన్ని ఈ ఉగాది పుర‌స్కాల్లో ప్రదానం చేశారు. మురళీమోహన్ .. బ్రహ్మానందం చేతుల మీదుగా ర‌మేష్ ప్ర‌సాద్ కి ఈ పుర‌స్కారం ద‌క్కింది. ఇత‌ర విభాగాల‌కు అవార్డుల‌ను అందించారు.

అప్ప‌ట్లో ఘ‌నంగా ప్ర‌క‌టించారు కానీ!

ఏపీ తెలంగాణ డివైడ్ అనంత‌రం సినీప‌రిశ్ర‌మ ప‌రిస్థితి ఆగమ్య‌గోచ‌ర‌మే అయ్యింది. ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ లోనే ఉంటుందా లేక ఏపీకి త‌ర‌లివెళుతుందా? అన్న‌దానిపై బోలెడంత చ‌ర్చ సాగింది. అయితే ఆరంభం తెలంగాణ ప్ర‌భుత్వం సినీప‌రిశ్ర‌మ‌కు తోడ్పాటునిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికింది. ఏపీకి నందులు ఉన్న‌ట్టే తెలంగాణ ప్రభుత్వం సింహా పేరుతో అవార్డులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ మేరకు ఈ అంశంపై ఓ కమిటీని నియమించి రివ్యూలు చేయించింది.

నాటి ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో సినీ ప్రముఖులు.. ప్రభుత్వ అధికారులు.. నిపుణుల కమిటీ ఆరు నెలలు విస్తృతస్థాయిలో చర్చించి ఈ నిర్ణయం ప్ర‌క‌టించారు. మొత్తం నలభై విభాగాల్లో ఈ అవార్డులు ఉండాలని కమిటీ సూచించారు. ల‌క్ష‌ల్లో అవార్డుల‌కు ప్రైజ్ మ‌నీనికి కూడా ఫిక్స్ చేశారు. అయితే అనంత‌రం ``ప్ర‌క‌ట‌న‌లు ఘ‌నం.. పనులు శూన్యం`` అన్న చందంగా స‌న్నివేశం మారింది. అటువైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అవార్డుల వ్య‌వ‌హారంపై చూసీ చూడ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించ‌డంపైనా సినీప‌రిశ్ర‌మ‌లో అసంతృప్తి అలానే ఉంది.
Tags:    

Similar News