మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' అనే సినిమాను తీసిన విషయం తెల్సిందే. అమృత.. ప్రణయ్ ల ప్రేమతో పాటు మారుతి రావు కు కూతురుపై ఉన్న ప్రేమను కూడా వర్మ తన సినిమాలో చూపించబోతున్నాడు. మారుతి రావు మృతికి కారణం అమృత అన్నట్లుగా వర్మ మర్డర్ సినిమాలో చూపించబోతున్నట్లుగా ఆయన ఇప్పటికే విడుదల చేసిన వీడియోలు మరియు పాటలను బట్టి అనిపిస్తుంది. అందుకే మర్డర్ సినిమాను నిలిపేయాలంటూ అమృత కోర్టును ఆశ్రయించింది. వర్మ పోరాడి సినిమాకు క్లియరెన్స్ తెచ్చుకున్నాడు. ఈనెల 24 ను విడుదల చేసేందుకు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశాడు.
ఇంతటి సంచలన విషయాన్ని వర్మ సినిమాగా తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా కూడా జనాల్లో చర్చ మాత్రం మామూలుగానే జరుగుతుంది. ఆ హీట్ ను పెంచేందుకు.. వివాదాన్ని మరింత పెంచేందుకు అన్నట్లుగా వర్మ ఏకంగా మిర్యాలగూడెంలో ప్రెస్ మీట్ ను పెట్టి మర్డర్ సినిమా ప్రమోషన్ ను నిర్వహించాలని వర్మ నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన ప్రకటన కూడా చేశాడు. ఈనెల 22న మిర్యాలగూడెంలో ప్రెస్ మీట్ ఉంటుందని వర్మ ప్రకటించాడు.
మిర్యాలగూడెంలో ఎందుకు అంటే మాకు ఉండే కొన్ని కారణాలు మాకు ఉన్నాయని ముందే వర్మ వివాదాన్ని మెల్లగా హింట్ ఇచ్చాడు. విడుదలకు రెండు రోజుల ముందు అక్కడ ప్రెస్ మీట్ అంటే ఖచ్చితంగా అమృత ప్రణయ్ ల విషయం అదే విధంగా మారుతి రావు విషయంను జనాల్లోకి తీసుకు వెళ్లినట్లే అంటూ వర్మ భావిస్తున్నాడు. దాంతో సినిమాకు కాస్త ఎక్కువ టికెట్లు తెగే అవకాశం ఉందంటున్నారు. కాని వర్మ తీరును మాత్రం చాలా మంది తప్పుబడుతున్నారు.