'సర్కార్‌' వివాదంపై మురుగ రియాక్షన్‌

Update: 2018-10-27 11:32 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్‌’ భారీ అంచనాల నడుమ వచ్చే నెల 7న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో వరుణ్‌ రాజేంద్రన్‌ అనే రచయిత ‘సర్కార్‌’ కథ నాదని - మురుగదాస్‌ తన కథను కాపీ చేశాడంటూ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. తమిళంతో పాటు - తెలుగులో భారీ ఎత్తున విడుదలకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కథ కాపీ అంటూ కోర్టుకు వెళ్లడంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో దర్శకుడు మురుగదాస్‌ వివాదం గురించి స్పందిస్తూ.. ఇది కేవలం పబ్లిసిటీ కోసం ఆడుతున్న డ్రామా. సినిమా ఇంకా రిలీజ్‌ కాకుండానే ఆయన కథను కాపీ చేశామని - స్క్రిప్ట్‌ ను వాడుకున్నామని ఎలా నిర్థారణకు వస్తారంటూ మురుగదాస్‌ ప్రశ్నించాడు. ఆయన చేస్తున్న కాపీ ఆరోపణలను తాను కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లుగా మురుగదాస్‌ ప్రకటించాడు. సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ చిత్రంలో విజయ్‌ కి జోడీగా కీర్తి సురేష్‌ హీరోయిన్‌ గా నటించింది. కీలక పాత్రలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నటించింది. విజయ్‌ మరియు మురుగదాస్‌ ల కాంబినేషన్‌ లో గతంలో వచ్చిన ‘కత్తి’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాహుబలి రికార్డును ఈ చిత్రం బ్రేక్‌ చేస్తుందనే టాక్‌ కూడా వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో కథ కాపీ అంటూ వివాదం కావడంతో సినిమాపై ప్రభావం ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కాపీ వివాదం వచ్చే గురువారం మద్రాస్‌ హైకోర్టులో విచారణకు రానుంది.
Tags:    

Similar News