వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్మీకికి వరసబెట్టి ట్విస్టులు తప్పడం లేదు. ఇప్పటికీ పూజా హెగ్డే ఇందులో చేస్తోందా లేదా అనే అయోమయం వీడలేదు. పారితోషికం విషయంలో తన మీద జరుగుతున్న ప్రచారానికి హర్ట్ అయిన పూజా దీనికి నో చెప్పినట్టు వారం రోజులుగా వార్త షికారు చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా సంగీత దర్శకుడి విషయంలోనూ ఇలాంటి మలుపే చోటు చేసుకుంది.
ముందు సెట్ చేసుకున్న దేవి శ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఇదే దర్శకుడితో గతంలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ని డిజే లాంటి మ్యూజికల్ హిట్ ని ఇచ్చిన దేవి ఇప్పుడు ఏవో సృజనాత్మకత కారణాల వల్ల పక్కకు వచ్చినట్టు టాక్. అసలే దేవికి ఈ ఏడాది వినయ విదేయ రామ మహర్షి రూపంలో ఆల్బమ్స్ కు పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడిలా జరగడం ఊహించనిదే
ఈ స్థానంలో మిక్కి జే మేజర్ వచ్చినట్టు తెలిసింది. స్టార్ హీరోతో మాస్ సినిమాకు సంగీతం అందించే ఛాలెంజ్ మిక్కి జే మేయర్ ఎలా తీసుకుంటాడో చూడాలి. వాల్మీకి తమిళ బ్లాక్ బస్టర్ జిగర్ తాండా ఆధారంగా రీమేక్ అవుతోంది. అందులో బాబీ సింహా చేసిన పాత్రను తెలుగు నేటివిటీకి తగ్గట్టు వరుణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసి కొత్తగా తెరకెక్కిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్ ఉంది. నిర్మాణం నుంచి కొంత కాలం గ్యాప్ తీసుకున్న 14 రీల్స్ దీంతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చే ప్లాన్ లో ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ సంగతి కొలిక్కి వచ్చింది కాబట్టి ఇక హీరొయిన్ ఎవరో తేలిపోతే వాల్మీకికి సంబంధించి కీలకమైన అప్ డేట్స్ వచ్చేసినట్టే