బాలయ్య కోసం ఇళయరాజానేనా?

Update: 2016-08-11 09:58 GMT
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నుంచి దేవిశ్రీ ప్రసాద్ బయటికొచ్చేసిన సంగతి ఆల్మోస్ట్ కన్ఫమ్ అనే అనుకోవాలి. ఈ వార్త బయటికి వచ్చాక దీన్ని ఖండిస్తూ స్టేట్మెంట్లు ఏమీ రాలేదు. కాబట్టి ‘గౌతమీపుత్ర..’కు మ్యూజిక్ డైరెక్టర్ మారుతున్నాడన్నది ఖాయమే. ఐతే ఇక్కడ క్లాషెస్ ఏమీ లేవని.. అండర్ స్టాండింగ్ తోనే దేవి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాని తెలుస్తోంది. ఇంకో రెండు మూడు రోజుల్లో మ్యూజిక్ డైరెక్టర్ని ఫైనలైజ్ చేసి.. ఆ తర్వాత దేవిశ్రీ ఈ సినిమా నుంచి తప్పుకున్న సంగతి వెల్లడించాలని క్రిష్ భావిస్తున్నాడు. ఐతే క్రిష్ ఇప్పుడు ఇద్దరు సంగీత దర్శకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. ఓవైపు ‘కంచె’కు మంచి ఔట్ పుట్ ఇచ్చిన చిరంతన్ భట్ ను ఆప్షన్ గా పెట్టుకుని.. ఇంకోవైపు ఇళయారాజా గురించి ఆలోచిస్తున్నాడట.

ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు ఇళయరాజాకు మించి ఆప్షన్ ఇంకొకరు కనిపించరు. ఆ కాలానికి ఎలాంటి సంగీతం ఇస్తే బాగుంటుందన్నది ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. కాకపోతే దేవిశ్రీని తొందరపెట్టినట్లు ఆయన్ని తొందర పెట్టలేరు. సినిమాలు ఎంచుకునే విషయంలో ఆయన సెలెక్టివ్ గా కూడా ఉంటారు. వీళ్లు అడగ్గానే ఒప్పేసుకుంటారని అనుకోలేం. ఈ విషయంలో బాలయ్య చొరవ తీసుకుంటూ ఉండొచ్చు. రాజా ఓకే అంటే.. ఆయనకు బాధ్యతలు ఇచ్చేస్తారు. లేదంటే చిరంతన్ భట్ తో కానిచ్చేస్తారు. బాలయ్య నటించిన చివరగా నటించిన పౌరాణిక చిత్రం ‘శ్రీరామరాజ్యం’కు ఇళయరాజా ఎంత గొప్ప సంగీతాన్నందించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Tags:    

Similar News