స్వ‌రాల చోరుల‌పై మ్యాస్ట్రోదే పైచేయి

Update: 2019-06-05 06:15 GMT
ముక్కు సూటిగా త‌ప్పును క‌డిగేయ‌డం.. హ‌క్కుల కోసం పోరాడ‌డం.. చాద‌స్తం ఎలా అవుతుంది? అవును .. ఈ విష‌యంలో త‌న‌ని త‌ప్పు ప‌ట్టే వారిదే త‌ప్పు!! అని నిరూపించారు మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా. సుస్వ‌రాల సంగీత సామ్రాజ్యంలో ఎదురే లేని స్వ‌ర‌మాంత్రికుడిగా ఇళ‌య‌రాజా ప్ర‌స్థానం గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అయితే ఆయ‌న స్వ‌రాల్ని కాపీ కొట్టి ఎంద‌రో `సంగీత ద‌ర్శ‌కులం` అని టైటిల్ కార్డ్స్ వేయించుకున్నారు. ఏ ట్యూన్ విన్నా ఇదెక్క‌డో వినేసిన‌ట్టే ఉంది! అని శ్రోత‌లు ఫీలైన సంద‌ర్భాలెన్నో.

ఇక‌పోతే ఇళ‌య‌రాజా సృజించిన స్వ‌రాల్ని ఎంతో తెలివిగా కొట్టేసి వీటిపై మాకే హ‌క్కులు ఉన్నాయి అంటూ కోర్టుకెక్కిన ఆడియో లేబుల్ కంపెనీల మెడ‌లు వొంచ‌డంలో ఇళ‌య‌రాజా పంతం నెగ్గ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆ మేర‌కు 14 మ్యూజిక్ లేబుల్స్ పై రాజా కోర్టులో పోరాడి నెగ్గారు. స‌ద‌రు లేబుల్స్ ఒప్పందంలో త‌ప్పిదాన్ని ఎత్తి చూపుతూ మ‌ద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు సంచ‌ల‌న‌మైంది. 2014 నుంచి సాగుతున్న ఈ వివాదానికి తాజాగా ఎండ్ కార్డ్ ప‌డింది. ఇళ‌య‌రాజా సంగీతం అందించిన పాట‌ల‌న్నిటిపైనా ఆయ‌న‌కు మాత్ర‌మే హ‌క్కులు ఉన్నాయ‌ని కోర్టు తీర్పును వెలువ‌రించింది. ఈ కేసు పూర్వాప‌రాల్లోకి వెళితే..

2013లో మ‌లేషియాకు చెందిన‌ ఏజీఐ మ్యూజిక్ లేబుల్ కంపెనీ ఇళ‌య‌రాజాపై కోర్టులో పిటిష‌న్ వేసింది. 2007 నుంచి కొన్ని పాట‌ల‌కు సంబంధించి త‌మ‌కు హ‌క్కుల్ని ద‌ఖ‌లుప‌రిచి అనంత‌రం ఒప్పందాన్ని ఉల్లంఘించార‌ని ఇళ‌య‌రాజాపై స‌ద‌రు ఆడియో కంపెనీ దావా వేసింది. అనంత‌రం ఇళ‌య‌రాజా స‌ద‌రు కంపెనీయే త‌న అనుమ‌తి లేకుండానే ఒప్పందాన్ని మీరి హ‌క్కుల్ని దుర్వినియోగం చేస్తోంద‌ని కోర్టులో రివ‌ర్స్ కేసు వేశారు. ఈ కేసు నేటితో క్లియ‌రైంది.

ఇక‌పోతే అమెరికాలో ఓ కాన్సెర్టు విష‌య‌మై ఎస్.పి.బాలు స‌హా ఆర్గ‌నైజ‌ర్స్ పైనా ఇళ‌య‌రాజా కోర్టు ద్వారా పోరాడి త‌న హ‌క్కుల విష‌యంలో నెగ్గిన సంగ‌తి తెలిసిందే. పండించేవాడే రైతు అన్న చందంగానే స్వ‌రాల్ని సృజించేవాడే మెజారిటీ హ‌క్కుదారు! అంటూ కోర్టుల ప‌రిధిలో తీర్పు వెలువ‌డింది. తాజాగా 13 మ్యూజిక్ లేబుల్స్ విష‌యంలోనూ రాజా నెగ్గ‌డానికి ఇదే  క్లాజ్ సాయ‌మైంద‌న్న‌మాట‌.

    
    
    

Tags:    

Similar News