గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న కిల్లింగ్ వీరప్పన్ సినిమా డిసెంబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ కు రెఢీ అవుతోంది. అయితే సినిమా రిలీజ్ కు రెఢీ అవుతున్న వేళ వీరప్పన్ భార్య ఈ సినిమాను తన అనుమతి లేకుండా రిలీజ్ చేయకూడదని డిమాండ్ చేశారు. గురువారం ఆమె బెంగళూరు ప్రెస్ క్లబ్ లో విలేకర్లతో మాట్లాడారు.
దర్శకుడు రాంగోపాల్ వర్మ తనను మోసం చేశారని...ఈ సినిమాను హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తామని వర్మ తన నుంచి అనుమతి తీసుకున్నారని అయితే ఇప్పుడు కన్నడ - తమిళ భాషల్లో కూడా సినిమా రిలీజ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ సినిమాను తాను చూశాక...తన అనుమతి పొందాక ..అది కూడా హిందీ - తమిళ భాషల్లో మాత్రమే విడుదల చేయాలన్నారు. కిల్లర్ వీరప్పన్ అనే సినిమా టైటిల్ అభ్యంతరంగా ఉందని ఈ సినిమా ట్రైలర్ చూస్తే వీరప్పన్ ను చెడుగా చూపించినట్టు అర్థమైందని ఆమె చెప్పారు. అదే జరిగితే ఆ ప్రభావం తమ కుటుంబ సభ్యులపై కూడా పడుతుందని ముత్తులక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు.
కిల్లింగ్ వీరప్పన్ సినిమా రిలీజ్ ఆపేందుకు తాము హైకోర్టు నుంచి అనుమతులు కూడా పొందామని ముత్తులక్ష్మి చెప్పారు. ముత్తులక్ష్మి వాదన ఇలా ఉంటే అట్టహాస కన్నడ సినిమా డైరెక్టర్ రమేష్ వెర్షన్ మరోలా ఉంది. 2006 సంవత్సరంలోనే రూ. 31 లక్షలు ముత్తులక్ష్మి ఇచ్చి వీరప్పన్ జీవిత చరిత్రపై సినిమా తీసేందుకు తాము హక్కులు పొందామని చెపుతున్నాడు. తీరా ఇప్పుడు సినిమా కంప్లీట్ అయ్యి మరో వారంలో రిలీజ్ అవుతుండగా అడ్డంకులు పెట్టడం సమంజసం కాదని ఆమె చెప్పారు.
ఎప్పుడూ ఏదో ఒక సంచలన క్రియేట్ చేసి తన సినిమాలకు పబ్లిసిటీ కోరుకునే వర్మ తాజా సినిమా కిల్లింగ్ వీరప్పన్ కు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి రూపంలో మరింత పబ్లిసిటీ వస్తోంది. వర్మ దర్శకత్వం వహించిన తొలి కన్నడ సినిమా కావడంతో పాటు వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ కావడంతో ఈ సినిమాపై సౌత్ లో అన్ని భాషల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే నెల 4న 2వేల థియేటర్లలో కిల్లింగ్ వీరప్పన్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.