నా బ్లడ్ గ్రూప్ U/A: స్టార్ హీరో

Update: 2022-07-01 13:30 GMT
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రణ్ బీర్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంటూ ఉంటాడు.

అయితే ఇటీవల కాలంలో మాత్రం బాలీవుడ్ సినిమాలు వరుసగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. దీంతో రణ్ బీర్ నుంచి రాబోయే సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

షంషేరా అనే సినిమా లో రణబీర్ కపూర్ మొదటి సారి రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలో కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ కూడా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురు చూసి జూలై 22 వ తేదీన విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు.

అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ తన బ్లడ్ గ్రూప్ అనేది U/A అని వివరణ ఇవ్వడం విశేషం. సాధారణంగా సినిమాలకు సెన్సార్ పరంగా U/A సర్టిఫికేట్ ను అందిస్తూ ఉంటారు.

అయితే తన బ్లడ్ గ్రూప్ లోనే తన సినిమాలకు అలాంటి సర్టిఫికేట్ లభిస్తుంది అంటూ చాలా సరదాగా వివరణ ఇచ్చాడు. దీంతో ఈ విషయం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. రణబీర్ కపూర్ రీసెంట్ గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా త్వరలో తండ్రి కాబోతునట్లు కూడా శుభవార్త ను అందించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక పెళ్లి చేసుకున్న మరుసటి రోజు నుంచే ఈ హీరో సినిమాలతో చాలా బిజీ అయిపోయాడు. ఇంతవరకు ఆలియా భట్ తో కలిసి పెద్దగా హనీమూన్ కి కూడా వెళ్ళింది లేదు. కేవలం వీకెండ్స్ మాత్రమే తన భార్యతో కలవడానికి కుదురుతుంది అని తెలియజేశాడు. ఇక షంషేరా సినిమా తో పాటు రణబీర్ కపూర్ నుంచి బ్రహ్మాస్త్ర అనే పాన్ ఇండియా సినిమా రాబోతోంది. ఆ సినిమాను తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. తెలుగులో రాజమౌళి సమర్పణలో బ్రహ్మాస్త్ర విడుదలకానుంది.
Tags:    

Similar News