టాలీవుడ్ లో వున్న అత్యంత ప్రామిసింగ్ అండ్ క్రేజీ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీమేకర్స్. ఈ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' చిత్రంతో టాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇండస్ట్రీలో వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో టాప్ వన్ ప్రొడక్షన్ కంపనీగా అనతి కాలంలోనే మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఇటీవల ఉప్పెన, 'పుష్ప' చిత్రాలతో భారీ లాభాల్ని సొంతం చేసుకున్న సంస్థగా టాప్ లో నిలిచింది. ఇలాంటి క్రేజీ సంస్థ ఇప్పడు ఓ యంగ్ హీరో సినిమాకు కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అయిపోతుండటం హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ ప్రొడక్షన్ కంపనీగా పాపులారిటీని దక్కించుకుంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ వరుసగా భారీ చిత్రాలని నిర్మిస్తోంది. అల్లు అర్జున్ తో 'పుష్ప ది రూల్' ని త్వరలోనే ప్రారంభించబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం కాబోతోంది. ఫస్ట్ పార్ట్ కి మించి సెకండ్ పార్ట్ వుండేలా ప్లాన్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో 'సర్కారు వారి పాట' చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన కళవతి లిరికల్ వీడియో నెట్టింట ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తూ రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనితో పాటు నేచురల్ స్టార్ నానితో 'అంటే సుందరానికి' చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తయిన ఈ మూవీ జూన్ 10న రాబోతోంది.
సుధీర్‌బాబు, కృతిశెట్టిలతో ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తున్న ' ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రానికి సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇక బాలకృష్ణ 107వ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్న మైత్రీ వారు మెగాస్టార్ తో 'వాల్తేరు వీరయ్య' చిత్రాన్ని బాబితో నిర్మిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఈ స్థాయిలో భారీ చిత్రాలని లైన్ లో పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో సినిమాకు ప్లాన్ చేస్తున్నారట.
ఇటీవల కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్' మూవీతో భారీ డిజాస్టర్ ని అందుకున్నారు. అంతే కాకుండా ఈ మూవీ కారణంగా డిస్ట్రీబ్యూటర్లు 90 శాతం నష్టాలని చవిచూశారు. అయినా సరే ఈ హీరోతో సినిమా చేయాలని, 9 కోట్లతో అతని సినిమాకు ఖర్చు చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ రెడీగా వుండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఓ ఫ్లాప్ హీరో కోసం 9 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయడానికి మైత్రీ వారు ఎంతకు సాహసం చేస్తున్నారన్నది ఇండస్ట్రీలో ఎవరికీ అర్థం కావడం లేదట.