సర్ ప్రైజ్ చేసిన స్వాతిముత్యం!
నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయులిద్దరు టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయులిద్దరు టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పెద్ద కుమారుడు శ్రీనివాస్ పుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హీరోగా మూడు నాలుగు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. అయితే అతడి కెరీర్ కి ఇంకా సరైన సక్సస్ పడలేదు. అయినా అవకాశాల పరంగా ఎలాంటి ఢోకా లేదు. ఉన్న ఇమేజ్ తో కొత్త అవకాశాలు ఒడిసి పట్టుకుంటున్నాడు.
సరిగ్గా ఇదే సమయంలో బెల్లంకొండ చిన్న కుమారుడు గణేష్ కూడా `స్వాతిముత్యం` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.నటుడిగా తొలి సినిమాతో మంచి మార్కులు పడ్డాయి. హీరోయిక్ లుక్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ సినిమాలు చేయడంలో జోరు మాత్రం చూపించలేకపోయాడు. స్వాతి ముత్యం రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. ఆ తర్వాత మళ్లీ ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
మరి సరైన స్టోరీ కోసం ఎదురు చూడటంలో ఆలస్యమవుతుందా? అవకాశం కోసం ఎదురు చూడం వల్ల డిలే అవుతుందా? అన్నది తెలియదు గానీ తాజాగా రెండవ ప్రాజెక్ట్ తో సర్ ప్రైజ్ చేసాడు. సతీష్ రెడ్డి మల్లిడి అనే కొత్త కుర్రాడితో ప్రాజెక్ట్ లాక్ చేసాడు. ఇందులో మలయాళం భామని గణేష్ కి జోడీగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి నిర్మాత ఎవరు? ఎలాంటి కథాంశంతో వస్తున్నారు? ప్రారంభోత్సవం ఎప్పుడు? అన్నది తెలియాల్సి ఉంది.
కుమారులిద్దర్నీ స్టార్ హీరోలగా తీర్చిదిద్దాలని తండ్రి సురేష్ ఎంతో తపిస్తున్నారు. కొంత కాలంగా ఆయన కూడా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. `సాంబయ్య` సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సురేష్ నిర్మాతగా ఎన్నో సినిమాలకు పనిచేసారు. అటుపై కొన్ని వైఫల్యాలు ఆయన్ని వెనక్కి లాగిపెట్టాయి. చివరిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ `రభస` నిర్మించిన సంగతి తెలిసిందే.