రీమేక్ తో కాదు...సొంత కథతోనే హిట్ ఇస్తా!
కానీ వినోద్ 'భగవంత్ కేసరి'ని రీమేక్ చేస్తున్నట్లు ఓ ప్రచారం తెరపైకి వచ్చింది.
కోలీవుడ్ డైరెక్టర్ హెచ్. వినోధ్ గురించి పరిచయం అవసరం లేదు. ' ఖాకీ', 'వలిమై', 'తునీవు' లాంటి యాక్షన్ చిత్రాలతో కోలీవుడ్ లో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని దక్కించుకున్నాడు. తనదైన స్టైలిష్ యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించడం వినోధ్ ప్రత్యేకత. అలాంటి పేరున్న డైరెక్టర్ 'భగవంత్ కేసరి' చిత్రాన్ని రీమేక్ చేస్తు న్నాడు? అంటే ఎవరైనా నమ్ముతారా? అదీ తలపతి 69వ చిత్రంగా 'భగవంత్ కేసరి' రీమేక్ అంటే జరిగే పనేనా? అంటే అందుకు ఎంత మాత్రం ఛాన్సే ఉండదు.
కానీ వినోద్ 'భగవంత్ కేసరి'ని రీమేక్ చేస్తున్నట్లు ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. ఇది విని నవ్వుకోవడం తప్ప! సాధ్య పడదన్నది మెజార్టీ వర్గం తాజాగా అభిప్రాయ పడుతోంది. ప్రస్తుతం విజయ్ 69వ చిత్రం ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' రీమేక్ అనగానే విజయ్ అభిమానుల్లో ఒక్కసారిగా నీరసం అందుకుంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు ఇలాంటి సినిమాతో ఉపయోగం ఏంటి? అసలు విజయ్ ఇమేజ్ కి ఆ స్టోరీ సెట్ అవుతుందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు వినోద్ ఈ ప్రాజెక్ట్ పై పుల్ క్లారిటీ ఇచ్చేసారు. 69వ చిత్రం ఏ సినిమాకు అధికారిక రీమేక్ కాదని, పూర్తిగా తన ఒరిజినల్ స్క్రిప్ట్ తో రూపొందుతున్న చిత్రమని పుల్ క్లారిటీ ఇచ్చేసారు. అభిమానులెవరు ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దని తన మార్క్ చిత్రంగా 69వ సినిమా ఉంటుందని తెలిపారు. దీంతో విజయ్ అభి మానులు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వినోద్ ని ఆకాశానికి ఎత్తేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఈ సినిమా విజయ్ రాజకీయ ప్రయాణానికి ముందు చిరస్మరణీయ వీడ్కోలు చిత్రంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయ్ గత సినిమా 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందు కోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో వినోద్ 69వ చిత్రంతో గొప్ప విజయాన్ని అందించి పొలిటికల్ బరిలోకి దించాలని చూస్తున్నారు.