అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ స్పీచ్‌ని గమనించారా?
'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ వేదికపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇప్పుడు ఏపీలో ప్రతి తెలుగోడి ఇంటా ప్రతిధ్వనిస్తోంది.
'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ వేదికపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇప్పుడు ఏపీలో ప్రతి తెలుగోడి ఇంటా ప్రతిధ్వనిస్తోంది. అయితే ఈ స్పీచ్‌లో ఆయన సర్వేజనా సుఖినోభవంతు! అంటూ సినీపరిశ్రమలో ప్రతి హీరో బావుండాలని కోరుకుంటున్నట్టు ప్రకటించారు. పవన్ తన స్పీచ్ లో ఇలా ప్రస్థావించారు.
మేం 'మెగాభిమానులు' అనే పదాలు ఎందుకు వాడము అంటే.. ఇక్కడ అందరు హీరోల అభిమానులు ఉన్నారు అని గేమ్ ఛేంజర్ వేదిక దిగువన ఉన్న ప్రజలనుద్ధేశించి పవన్ అన్నారు. ''ఒక హీరో అభిమానులు ఇతర హీరోలను ఇష్టపడతారు. జూనియర్ ఎన్టీఆర్ ని.. అల్లు అర్జున్ గారిని.. ప్రభాస్ గారిని ఇష్టపడతారు. ఘట్టమనేని మహేష్ ని ఇష్టపడతారు.. అందరు హీరోల అభిమానుల్లో ప్రత్యేకించి రామ్ చరణ్‌కి అభిమానులు ఉంటారు. నాని సినిమాలు మా సోదరికి చాలా బాగా నచ్చుతాయి'' అంటూ హీరోల అభిమానుల మధ్య సోదరభావాన్ని పెంచే ప్రయత్నం చేసారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఇలాంటి మంచి సంస్కృతిని చిరంజీవి గారు నేర్పించారని, ఇతర హీరోలను ద్వేషించడం మాకు తెలీదని, కళామతల్లి సాక్షిగా చెబుతున్నానని, ఆ కల్చర్ మా ఇంట్లో లేదని పవన్ అన్నారు. 'సర్వే జనో సుఖినోభవంతు'.. నాన్న నేర్పించిన కల్చర్. మేమే బావుండాలి. వాళ్లు బాగుండకూడదు అనుకోం. అలాంటి మంచి వాతావరణంలో పెరిగాం. చరణ్ అలాంటి వాతావరణంలో పెరిగిన పరిశ్రమ వ్యక్తి అని కూడా పవన్ అన్నారు. ఇదే ఈవెంట్లో అల్లు అర్జున్ గారిని ఇష్టపడే అభిమానులు చరణ్ ని ఇష్టపడతారని కూడా పవన్ వ్యాఖ్యానించారు.
'పుష్ప 2' రిలీజ్‌కి ముందు మెగాభిమానులు అల్లు అర్జున్‌ని టార్గెట్ చేసారని, సోషల్ మీడియాల్లో చాలా ప్రచారం సాగింది. 'పుష్ప 2' రిలీజ్ ఆలస్యం కావడానికి మెగా హీరోలే కారణమని కూడా ప్రచారం సాగించారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ అన్ని సందేహాలను తనదైన శైలిలో క్లియర్ చేసారు. 'పుష్ప 2' భారీ కాన్వాసుపై తెరకెక్కుతుండగా, షూటింగ్ షెడ్యూళ్లలో డిలేను ఎదుర్కోవాల్సి వచ్చిందని చిత్రబృందం స్పష్ఠం చేసింది.