పూనమ్ సంచలన ట్వీట్.. మళ్లీ త్రివిక్రమ్ గురించే..
రీసెంట్ గా తెలంగాణ సీఎంతో టాలీవుడ్ పెద్దల సమావేశంపై రెస్పాండ్ అయింది.
నటి పూనమ్ కౌర్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. తన ట్వీట్స్ అండ్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలిచే పూనమ్.. అనేక విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటుందనే చెప్పాలి. రీసెంట్ గా తెలంగాణ సీఎంతో టాలీవుడ్ పెద్దల సమావేశంపై రెస్పాండ్ అయింది.
అయితే కొంతకాలంగా డైరెక్టర్ త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ ఆరోపణలు చేస్తూనే ఉంది. అసలు వారి మధ్య వివాదమేంటో ఎవరికీ సరిగ్గా తెలియదు కానీ.. ఆమె పోస్టులపై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటి వరకు పూనమ్ పెట్టిన పోస్టులపై త్రివిక్రమ్ ఎప్పుడూ స్పందించలేదు. ఆమె కూడా క్లియర్ గా విషయాన్ని రివీల్ చేయడం లేదు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో తాను త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసినట్లు కొద్ది రోజుల క్రితం పూనమ్ చెప్పిన విషయం తెలిసిందే. తన ఫిర్యాదును సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించిన ఆమె.. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేసింది.
ఇప్పుడు మరోసారి అదే విషయంపై పోస్ట్ పెట్టింది పూనమ్. "నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసి చాలా కాలం అయినా.. ఇప్పుడు వరకు కనీసం ప్రశ్నించలేదు.. యాక్షన్ కూడా తీసుకోలేదు. అది కాకుండా నా ఆరోగ్యం, సంతోషంపై ప్రభావం పడేలా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఎంకరేజ్ చేస్తున్నారు" అంటూ పూనమ్ రాసుకొచ్చిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
దీంతో ఇప్పుడు మళ్లీ నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. అసలు ఏం జరిగిందని పూనమ్ ను అడుగుతున్నారు. జరిగిన విషయమేమిటో క్లియర్ గా చెప్పాలని కామెంట్లు పెడుతున్నారు. నిజంగా ఏమైనా ఉంటే చెబితే గా న్యాయం జరుగుతుందని హితవు పలుకుతున్నారు. అలా ఇప్పుడు పూనమ్ కౌర్ పోస్ట్.. నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఇక పూనమ్ విషయానికొస్తే.. ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న అమ్మడు... కొంత కాలం క్రితం సినిమాలకు దూరమైంది. మాయాజాలం మూవీతో టాలీవుడ్ లోకి వచ్చిన ఆమె.. తన యాక్టింగ్ తో మంచి మార్కులు సంపాదించుకుందనే చెప్పాలి. ఆ తర్వాత శౌర్యం, నిక్కీ అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి పలు సినిమాల్లో మెప్పించిన పూనమ్.. నాతి చరామి తర్వాత మరో మూవీలో కనిపించలేదు.