దుల్కర్ తో సాయి పల్లవి సెట్ అవ్వడం కష్టమేనా?
తాజాగా పవన్ సాధినేని దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రాన్ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు.
'సీతారామం' నుంచి దుల్కర్ సల్మన్ టాలీవుడ్ మార్కెట్ టార్గెట్ గా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే 'లక్కీ భాస్కర్' తో తెలుగులో మరో భారీ విజయం అందుకున్నాడు. తాజాగా పవన్ సాధినేని దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రాన్ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. 'ఆకాశంలో ఒక తార' అంటూ ఇద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఫిబ్రవరి తొలి వారంలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంత వరకూ హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి పేరు ఇప్పటికే పరిశీలనలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే సాయి పల్లవి డేట్లు దొరకడం కష్టమనే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు సినిమాలున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో 'రామాయణం'లో నటిస్తోంది. దీంతో పాటు మరో హిందీ సినిమా కూడా సెట్స్ లో ఉంది.
మరో నాలుగు సినిమాలు వివిధ భాషల్లో కమిట్ అయినట్లు అనధికారిక సమాచారం. ఈ నేపథ్యంలో దుల్కర్ సినిమా ఫిబ్రవరి లోనే పక్కాగా షూటింగ్ మొదలైతే సాయి పల్లవి కాల్షీట్లు సర్దుబాటు అవ్వడం కష్టం మట. అదే నెల నుంచి అమ్మడు నాలుగు నెలలు పాటు వివిధ షూట్లలో పాల్గొనాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎంట్రీ కష్టమనే మాట వినిపిస్తుంది. అయితే యూనిట్ సాయి పల్లవితో పాటు, మరో భామను కూడా ఆప్షన్ గా పరిశీలిస్తున్నారుట.
దీనిపై జనవరి నెలఖరు కల్లా ఓ క్లారిటీ వస్తుందని సమాచారం. సాయి పల్లవి ఇప్పటికే దుల్కర్ సరసన మలయా ళంలో 'కలీ' అనే చిత్రంలో నటించింది. అందులో బెస్ట్ పెయిర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత మళ్లీ ఆకాంబినేషన్ రిపీట్ కాలేదు.