ఏడాది వెనక్కి వెళ్దాం. అప్పటికే ‘పెళ్ళిచూపులు’ సినిమాతో మంచి విజయాన్నయితే అందుకున్నాడు కానీ.. విజయ్ దేవరకొండకు హీరోగా ఏ ఇమేజ్ లేదు. అతడి పేరు జనాలకు ఇంకా రిజిస్టరవ్వలేదు కూడా. కానీ ‘అర్జున్ రెడ్డి’తో అతడి ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అరడజనుకు పైగా క్రేజీ ప్రాజెక్టులు అతడి తలుపు తట్టాయి. గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్.. వైజయంతీ మూవీస్.. మైత్రీ మూవీ మేకర్స్.. లాంటి భారీ సంస్థల్లో సినిమాలు చేస్తున్నాడిప్పుడు. బుధవారం విజయ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నెలకొన్న హంగామా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఒక పెద్ద స్టార్ హీరో బర్త్ డేకి ఎలాంటి హంగామా కనిపిస్తుందో ఇప్పుడే అలాంటిదే కనిపిస్తోంది. ముందు రోజు సాయంత్రం నుంచే పెద్ద పెద్ద బేనర్లు అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ కొత్త కొత్త పోస్టర్లు వదిలారు. పీఆర్వోలు.. సెలబ్రెటీలు శుభాకాంక్షలతో హోరెత్తించేస్తున్నారు. విజయ్ అభిమానుల హడావుడి కూడా సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది.
ఏడాది కిందట విజయ్ పుట్టిన రోజు సమయానికి ఇలాంటి హంగామా ఏమీ లేదు. ‘ఎవడే సుబ్రమణ్యం’.. ‘పెళ్ళిచూపులు’ సినిమాలతో పేరు సంపాదించినప్పటికీ.. విజయ్ ని ఒక నటుడిగానే చూశారంతా. కానీ ఇప్పుడు అతడిని ఒక స్టార్ లా చూస్తున్నారు. తెలుగులో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇంత తక్కువ సమయంలో.. అది కూడా ఒకే ఒక్క సినిమాతో ఇలాంటి ఇమేజ్ సంపాదించిన వాళ్లు అరుదనే చెప్పాలి. కేవలం నటుడిగానే కాక వ్యక్తిగానూ తన విలక్షణత చాటుకుంటూ.. నేటి యువత ఆలోచనలకు ప్రతిబింబంలా కనిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు విజయ్. చేతిలో ఉన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల అంచనాల్ని అందుకుని వచ్చే ఏడాదికి ఇంకా పెద్ద స్థాయికి ఎదుగుతాడని ఆశిద్దాం.