పరిశ్రమలో ప్రవేశించిన తక్కువ సమయంలో అగ్ర బ్యానర్ గా నీరాజనాలు అందుకుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్. వరుసగా టాప్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాల్ని నిర్మించింది. గత కొంతకాలంగా చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురైనా అవేవీ మైత్రి స్పీడ్ ని ఆపలేదు. ప్రస్తుతం ఛరిష్మా ఉన్న హీరోలతో వరుసగా సినిమాలు తీస్తూ ఈ బ్యానర్ అంతకంతకు వేడి పెంచుతోంది. మైత్రి లైనప్ పరిశీలిస్తే ఇప్పుడున్న అగ్ర హీరోలందరి కాల్షీట్లను ఈ సంస్థ లాక్ చేసిందని తెలుస్తోంది.
ఇప్పటికిప్పుడు కాల్షీట్లు అందుబాటులో లేకపోయినా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో కమిట్ మెంట్లు ఉన్నాయి. అలాగే అల్లు అర్జున్ - సుక్కూ సినిమాని మైత్రి సంస్థనే తెరకెక్కిస్తోంది. ఆ తర్వాత మహేష్ .. ప్రభాస్ లతోనూ భారీ చిత్రాలకు మైత్రి సంస్థ ప్లాన్ చేస్తోంది. ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో భారీ లెవల్లో ఓ సినిమాని తెరకెక్కించాలని ఈ సంస్థ ఉవ్విళ్లూరుతోందట.
అందుకోసం గుట్టుచప్పుడు కాకుండా ప్రభాస్ కి భారీ మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇచ్చిందని తెలుస్తోంది. మైత్రి నుంచి ఇంతకుముందే ప్రభాస్ ఐదు కోట్ల అడ్వాన్స్ అందుకున్నారట. దానికి అదనంగా ఇటీవల మరో 8కోట్లు మైత్రి సంస్థ ప్రభాస్ కి అదనపు అడ్వాన్స్ రూపంలో ఇచ్చిందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ ప్రస్తుత కమిట్ మెంట్లు పూర్తి కాగానే మైత్రికి సినిమా చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. డార్లింగ్ ప్రస్తుతం జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ చిత్రంలో నటిస్తున్నాడు. తదుపరి మైత్రి బ్యానర్ లోనే సినిమా చేస్తాడని భావిస్తున్నారు.
ఇప్పటికే మైత్రి సంస్థ కేజీఎఫ్ దర్శకుడితో మంతనాలు సాగిస్తోంది. కేజీఎఫ్ 2 చిత్రంతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ .. ప్రభాస్ ఇద్దరూ ఆసక్తిగా ఉన్నారని ఇదివరకూ వార్తలొచ్చాయి. మరి ప్రస్తుతం ప్రభాస్ తో పని చేసేది అతడేనా? లేక వేరే ఎవరైనా దర్శకుడు కథ వినిపిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.