మలయాళంలో ''టూ కంట్రీస్'' పేరుతో ఒక సినిమా వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది హీరోయిన్ మమతా మోహన్ దాస్ రీ-ఎంట్రీ సినిమా. దిలీప్ హీరోగా రూపొందిన ఈ సినిమా పెద్ద హిట్టయ్యింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు రీమేక్ కహానీ విందాం పదండి.
అప్పట్లో ఈ సినిమాను విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తాడని అన్నారు. పైగా ఆయనకు ఈ మధ్యన వరుసగా దృశ్యం - గోపాలా గోపాలా వంటి రీమేక్ సినిమాలు బాగా కలిసొస్తున్నాయి కాబట్టి.. ఇది కూడా ఆయన ఖాతాలోనే పడుతుందని అందరూ అనుకున్నారులే. అయితే సడన్ గా ఈ సినిమా తాలూకు రీమేక్ రైట్స్ తానే కొనుక్కున్నానని.. త్వరలోనే ఈ సినిమాను ఒక పెద్ద హీరోతో రూపొందిస్తానని.. గడిచిన ఫిబ్రవరిలో ప్రకటించాడు నిర్మాత బండ్ల గణేష్. కాని ఆ తరువాత ఈ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూస్ సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు సడన్ గా ఈ సినిమా రీమేక్ తన స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు ఎన్.శంకర్ క్యాంపు నుండి ఒక న్యూస్ వచ్చింది. అసలు ఈ సినిమా ఇన్నేసి చేతులు మారుతుంటే భలే గమ్మత్తుగా ఉంది కదూ.
నిజానికి సినిమాను చాలా వరకు ఫారిన్ లో తీయాల్సి వుంటుంది. బడ్జెట్ బాగానే ఖర్చయ్యే ఛాన్సుంది. మరి బండ్ల గణేష్ ఈ ప్రాజెక్టు నుండి ఎందుకు తప్పుకున్నట్లు? ఇప్పుడు ఎన్.శంకర్ ఈ సినిమా నిజంగానే తీస్తున్నారా? ఇలాంటి సందేహాలకు క్లారిటీ రావాల్సి ఉంది.