నా పేరు 'రికార్డుల' సూర్య

Update: 2018-01-17 11:14 GMT
నా పేరు సూర్య విడుదలకు ఇంకా నాలుగు నెలల టైం ఉంది. కాని చాలా త్వరగా టీజర్ రిలీజ్ చేయటం ద్వారా మంచి ఎత్తుగడే వేసారు సూర్య టీం. విడుదల దగ్గర ఉన్నప్పుడు ఒకేసారి హైప్ తీసుకువచ్చి ఇబ్బంది పడకుండా దశల వారిగా ప్లాన్ చేస్తూ తెలివైన స్ట్రాటజీతో ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్. విడుదల తేది ఏప్రిల్ 27 అని గతంలోనే ప్రకటించారు కాని 2.0 మళ్ళి కన్ఫ్యూజన్ లోకి నెట్టే అవకాశం ఉండటంతో దేని గురించీ ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. ఈ లోపు సూర్య రికార్డుల మోత మొదలు పెట్టేసాడు. ఒక ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్  ఛానల్ దీనిని 24 కోట్లకు డీల్ చేసుకుంది అనే వార్త ఇప్పుడు పెద్ద షాకే ఇస్తోంది. ఇందులో తెలుగు, హింది రెండు బాషలకు సంబంధించి పూర్తి డిజిటల్ హక్కులు ఆ సంస్థకే చెందుతాయి.

ప్రస్తుతం సినిమా బిజినెస్ లో శాటిలైట్ తో డిజిటల్ హక్కులు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. యు ట్యూబ్ లో సరైనోడు హింది డబ్బింగ్ వెర్షన్ వంద మిలియన్ వ్యూస్ దాటి బ్లాక్ బస్టర్ హిందీ సినిమాలకు సైతం చేత కాని ఫీట్ సాధించింది. సన్ అఫ్ సత్యమూర్తి, డిజే కూడా అదే దారిలో ఉన్నాయి. పైగా టీవీ ఛానల్ టిఆర్పి రేటింగ్స్ లో కూడా బాహుబలిని మినహాయిస్తే బన్నీ మూవీస్ టాప్ ప్లేస్ లో కూర్చుంటున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే అంత పెద్ద డీల్ ఇచ్చినట్టు టాక్. కేరళలో సైతం భారీ ఉన్న క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ ఇమేజ్ నా పేరు సూర్యకు అక్కడ కూడా ప్లస్ గా మారనుంది. అక్కడి డీల్ ఇంకా జరగాల్సి ఉంది.

స్టార్ స్టొరీ రైటర్ వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అను ఇమ్మానియేల్ హీరొయిన్. నిలువెల్లా కోపం నిండిన ఒక సిన్సియర్ మిలిటరీ ఆఫీసర్ కథ ఆధారంగా రూపొందిన నా పేరు సూర్యలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 26న మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసింది నా పేరు సూర్య టీం. ఆడియో సింగల్ ఒకటి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దేశభక్తిని మేల్కొలిపే టైటిల్ ట్రాక్ రిలీజ్ కావొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. యూనిట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
Tags:    

Similar News