ట్రైలర్ టాక్ : బేబీకి ముందు తాప్సీ

Update: 2017-02-13 05:12 GMT
బాలీవుడ్ లో హిట్ సినిమాలను సిరీస్ గా మలచడమో.. సీక్వెల్స్ చేయడమో సాధారణమే. కానీ ప్రీక్వెల్ టైపులో మాత్రం కథలు రావడం అరుదుగానే జరుగుతుంది. రెండేళ్ల క్రితం బేబీ అంటూ అక్షయ్ కుమార్ తో కలిసి నీరజ్ పాండే సెన్సేషన్ సృష్టించాడు. ఈ సినిమాలో బేబీ అనే టీంలో తాప్సీ ఒక భాగం అంతే. ఆ జట్టులోకి ఈ షబానా ఖాన్ ఎలా వచ్చింది అంటూ బేబీకి ముందు స్టోరీని 'నామ్ షబానా' పేరుతో తీసుకొస్తున్నారు. ఇప్పుడా చిత్రం ట్రైలర్ రిలీజ్ కాగా.. విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

షబానా ఒక సాధారణ యువతే. ఆమెకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న ఇండియన్ సెక్యూరిటీ ఏజన్సీ.. ఆమెకు కావాల్సిన సాయం చేస్తామని.. అన్ని రకాల ట్రైనింగ్స్ ఇప్పిస్తామని.. అయితే తమ కోసం ఓ పని చేయాలని డీల్ కుదుర్చుకుంటుంది. ఆ తర్వాత పర్సనల్ రివెంజ్ ను తాప్సీ ఎలా తీర్చుకుంది.. ఏజన్సీ చెప్పిన పని ఎంత డేంజర్ అయినా.. ఎలా డీల్ చేసింది అనే కాన్సెప్ట్ నామ్ షబానా. స్టోరీనే కాదు ప్రతీ విజువల్ ని ఆకట్టుకునేలా తీశారు.

ముఖ్యంగా తాప్సీ యాక్టింగ్ స్కిల్స్ గురించి ఎం చెప్పినా తక్కువ. స్పెషల్ ఏజన్సీ ట్రైనింగ్ కోసం కష్టపడ్డమే కాదు.. యాక్షన్ సీన్స్ కుమ్మేసింది. తాప్సీ తప్ప మరెవరూ ఇలాంటి రోల్ చేయలేరేమో అనిపించేసింది. మరోవైపు చిన్న పాత్ర అనే విషయం అర్ధమవుతున్నా.. అక్షయ్ కుమార్ చేసిన సపోర్టింగ్ రోల్ ని ప్రశంసించాల్సిందే.

Full View
Tags:    

Similar News