న‌భా నాదిర దిన్నా నాదిర దిన్నా

Update: 2021-04-25 07:30 GMT
టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ నేము ఫేము సంపాదించిన క‌థానాయిక‌ల్లో న‌భా న‌టేష్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. స‌మ్మోహ‌నం సినిమాతో క‌థానాయిక‌గా తెలుగు తెర‌పై మెరిసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో వెనుతిరిగి చూడాల్సిన పనే లేకుండా అవ‌కాశాలు అందుకుంటోంది. ఇలియానా త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి వైబ్రేన్సీ ఉన్న అమ్మ‌డిగా పాపులారిటీ ద‌క్కించుకుంది న‌భా.

ర‌వితేజ‌- రామ్ లాంటి క్రేజీ హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీ మునుముందు అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు చాలానే ఎత్తుగ‌డ‌లు వేస్తోంది. ప్ర‌స్తుతం వ‌రుస‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటున్న న‌భా త‌దుప‌రి ప‌లు క్రేజీ చిత్రాల్లో క‌నిపించ‌నుంది.

నభా త‌దుప‌రి అంధాధున్ తెలుగు రీమేక్ ‌మాస్ట్రోలో రాధికా ఆప్టే పాత్రలో క‌నిపించ‌నుంది. ఈ సినిమా త‌న కెరీర్ లో తొలి రీమేక్ అని తెలిపిన న‌భా.. ఈ పాత్ర‌ ఛాలెంజింగ్ గా తీసుకున్నాన‌ని తెలిపింది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ న‌భాకి ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణం. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో న‌భా హీట్ పెంచుతూనే ఉంది. తాజాగా న‌భా షేర్ చేసిన ఓ హాట్ ఫోటోకి అభిమానుల స్పంద‌న అసాధార‌ణంగా ఉంది. న‌భా అందం నాదిరి దిన్నా.. అంటూ అభిమానులు వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు. ఎన్బీకే స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాలో ఉదిత్ నారాయ‌ణ్ ఆల‌పించిన `నాదిరిదిన్నా.. నాదిరి దిన్నా న‌డుమే నాజూకు` సాంగ్ ఎంత‌టి చార్ట్ బ‌స్ట‌ర్ హిట్టో తెలిసిందే.
Tags:    

Similar News