ఫ్లాష్ బ్యాక్: కృష్ణ కాలర్ పట్టుకున్న నాగ్.. జీర్ణించుకోని సూపర్ స్టార్ ఫ్యాన్స్
టాలీవుడ్ లో రెండు పెద్ద ఫ్యామిలీలకు చెందిన హీరోలు కలిసి నటించడమనేది అరుదుగా జరుగుతుంది. స్క్రీన్ స్పేస్ - ఫ్యాన్స్ ఒపీనియన్స్ వంటివి పరిగణనలోకి తీసుకుని వెనుకడుగు వేస్తుంటారు. ఒకవేళ మల్టీస్టారర్ సినిమాలు వచ్చినా మా హీరోని తక్కువ చేసారంటూ అభిమానులు గోల గోల చేస్తుంటారు. పొరపాటున ఏ ఒక్క సీన్ లో అయినా ఒక హీరోని మరో హీరో తక్కువ చేసినట్లు కనిపించిందా, ఇంక అంతే సంగతులు. సరిగ్గా 28 ఏళ్ల క్రితం వచ్చిన ''వారసుడు'' సినిమా టైంలో ఫ్యాన్స్ మధ్య అలాంటి రచ్చే జరిగింది.
సూపర్ స్టార్ కృష్ణ - కింగ్ అక్కినేని నాగార్జున కలిసి నటించిన సినిమా ''వారసుడు''. నాగ్ సరసన గ్లామర్ క్వీన్ నగ్మా హీరోయిన్ గా నటించింది. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో మురళీ మోహన్ ఈ సినిమాని నిర్మించారు. దీనికి కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. 1993లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే జనాలు బుల్లితెరకు అతుక్కుపోతారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో కృష్ణ షర్ట్ కాలర్ ను నాగార్జున పట్టుకోవడం.. కృష్ణ పాత్ర చనిపోవడం వంటి వాటిపై అప్పట్లో ఫ్యాన్స్ అభ్యంతరం తెలిపారు.
'వారసుడు' సినిమాలో కృష్ణ - నాగార్జున తండ్రీకొడుకులు గా నటించారు. అప్పటికే హీరోగా సినిమాలు చేస్తున్న కృష్ణ డాన్ ధర్మతేజ పాత్రలో.. ఆయన తనయుడు వినయ్ పాత్రలో నాగ్ నటించారు. అయితే కథ ప్రకారం ఓ సీన్ లో నాగార్జున.. తండ్రి పాత్రధారి అయిన కృష్ణ కాలర్ పట్టుకుంటారు. అలానే క్లైమాక్స్ లో కృష్ణ పాత్ర చనిపోతుంది. ఈ రెండు అంశాలను జీర్ణించుకోని సూపర్ స్టార్ అభిమానులు అప్పట్లో పెద్ద రచ్చ చేశారు. చివరకు కృష్ణ రంగంలోకి దిగి.. కథ ప్రకారం అలాంటి సన్నివేశాలు పెట్టారు.. ఇలాంటివి పెద్ద సీరియస్ గా తీసుకోవద్దని నచ్చజెప్పడంతో అభిమానులు శాంతించారు. ఇకపోతే కృష్ణ - నాగార్జున ఆ తర్వాత 'రాముడొచ్చాడు' సినిమాలో తండ్రీ కొడుకులుగా నటించడం గమనార్హం.