'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన నాగ్ అశ్విన్.. 'మహానటి' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు కేవలం రెండు సినిమాలు డైరెక్ట్ చేసిన అనుభవమే ఉన్నా.. తన ప్రతిభతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ''ప్రాజెక్ట్ K'' అనే పాన్ వరల్డ్ మూవీ చేసే అవకాశం అందుకున్నాడు.
ఇదిలా ఉంటే దర్శకుడు నాగ్ అశ్విన్ గతేడాది ''పిట్టకథలు'' అనే ఆంథాలజీలో 'X లైఫ్' అనే చిన్న విభాగాన్ని తెరకెక్కించడంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. శృతి హాసన్ ప్రధాన పాత్రలో ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ఈ స్టోరీ.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
అయితే 'ఎక్స్-లైఫ్' ద్వారా ఇప్పుడు ఔత్సాహిక ఎడిటర్స్ ము నాగ్ అశ్విన్ అద్భుతమైన అవకాశాన్ని అందివ్వబోతున్నట్లు ప్రకటించారు. X-life ఎడిట్ ప్రోమో కట్ తో ఆకట్టుకునే వ్యక్తులకు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ యొక్క ఎడిట్/ప్రోమో విభాగంలో ఉద్యోగం పొందుతారని తెలిపారు.
ఈ మేరకు నాగ్ అశ్విన్ ట్వీట్ చేస్తూ.. ''ఎక్స్- లైఫ్ గుర్తుందా? నెట్ ఫ్లిక్స్ లో నా పిట్టకథ.. కొంచం ప్రతిష్టాత్మకమైనది.. అండర్ రైట్ చేయబడింది. ఎవరైనా ఎడిటర్ దాన్ని 2 నిమిషాలు లేదా పూర్తిగా రీ కట్ చేసి.. మరింత ఉత్తేజకరమైన అనుభూతిని కలిగించండి. వాటిలో ప్రభావంతంగా బెస్ట్ కట్ ని అందించిన వారికి వైజయంతి మూవీస్ లో ఎడిట్/ప్రోమో విభాగంలో ఉద్యోగానికి ఎంపిక చేయబడతారు'' అని పేర్కొన్నారు.
దీని జస్ట్ రీట్వీట్ చేసి #xlife ట్యాగ్ తో షేర్ చేయాలని నాగ్ అశ్విన్ సూచించారు. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎవరైనా వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థతో వర్క్ చేసే ఛాన్స్ కొట్టేస్తారేమో చూడాలి.
ఇకపోతే నాగ్ అశ్విన్ ప్రస్తుతం ''ప్రాజెక్ట్ K'' పనుల్లో బిజీగా ఉన్నారు. సైన్స్ ఫిక్షన్ - సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక బడ్జెట్ తో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విజువల్ వండర్ గా రూపొందించడానికి కృషి చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం లేటెస్ట్ టెక్నాలజీతో రెడీ చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా అర్రీ అలెక్సా-65 ని ఉపయోగిస్తున్నారు.
ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ - దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. డానీ శాంచెజ్-లోపెజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మరియు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.