పరభాషా నటులంటే మన దర్శక నిర్మాతలకు మహా ప్రీతి. అవసరాల వల్లో.. క్రేజ్ వల్లో.. కొన్ని పాత్రల్ని అనివార్యంగా వాళ్లతోనే చేయిస్తారు. ఐతే కొన్ని పాత్రలకు మన లోకల్ ఆర్టిస్టులైతేనే బాగుంటుందన్న ఫీలింగ్ కలుగుతుంది. మన మహానటి సావిత్రి జీవిత కథతో సినిమా తీస్తూ.. బాలీవుడ్ నటి విద్యా బాలన్ ను ఆ పాత్రకు తీసుకోబోతున్నారన్న వార్త రాగానే మన ప్రేక్షకులందరికీ ఏదోలా అనిపించింది. తెలుగులో హీరోయిన్లు ఎంత తక్కువైనా కూడా.. మరీ బాలీవుడ్ భామతో ఈ పాత్ర చేయిస్తే ప్రేక్షకులు అసలు కనెక్టవుతారా అని సందేహించారు. ఐతే సావిత్రి పాత్రను విద్యా బాలన్ తో చేయించబోతున్న మాట వాస్తవం కాదని.. అసలు తాను ఆమెను ఈ పాత్ర కోసం సంప్రదించనే లేదని అంటున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
‘‘నేనింకా ఈ పాత్ర కోసం ఏ నటినీ సంప్రదించలేదు. విద్యా బాలన్ ను కూడా అడగలేదు. అసలు నేనింకా స్క్రిప్టే పూర్తి చేయలేదు. ఆ పని పూర్తయ్యాక ఎవరినైనా సంప్రదిస్తా. కచ్చితంగా ఆ పాత్రకు వంద శాతం సూటయ్యే నటినే ఎంచుకోవాలి. కాబట్టి ఈ విషయంలో తొందరపాటు లేదు’’ అని నాగ్ అశ్విన్ చెప్పాడు. ‘మహా నటి’ పేరుతోనే ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపాడు. సావిత్రి ప్రజల మనసు గెలిచిన నటి అని.. అందుకే ఆమెపై తీసే సినిమా విషయంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని భావిస్తున్నామని.. హీరోయిన్ ఎంపిక విషయంలో ప్రజాభిప్రాయం కూడా తీసుకుంటామని.. వారి సలహాలు కూడా స్వీకరిస్తామని అశ్విన్ చెప్పాడు.