ఎవర్ గ్రీన్ హీరొయిన్ సావిత్రి బయోపిక్ గా తెరకెక్కుతూ ఇండస్ట్రీ లో విపరీతమైన ఆసక్తి రేపుతున్న మహానటి షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇటీవలే సావిత్రి గారి జయంతి సందర్భంగా టైటిల్ లోగో లాంచ్ చేసిన వైజయంతి సంస్థ రిలీజ్ డేట్ ని కూడా మార్చ్ 29గా లాక్ చేసింది. రామ్ చరణ్ రంగస్థలంతో నేరుగా ఫైట్ చేసేందుకు సై అంటోంది. అంతా బాగానే ఉంది కాని ఇందులో ఎంతవరకు నిజాలు చూపిస్తారు అనే దాని మీద పలురకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సావిత్రి గారి వైవాహిక జీవితం ఆవిడను మానసికంగా - ఆర్థికంగా చాలా దెబ్బ తీసింది. చివరి దశ ఎవరు ఊహించని రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కుంది. మరి వాటిని డిటైల్డ్ గా నాగ అశ్విన్ చూపిస్తాడా అనేది అనుమానించాల్సిన విషయమే.
అశ్విన్ సావిత్రి సబ్జెక్టు ఫైనల్ చేయడానికి ముందు ఆవిడ కుటుంబ సభ్యులను కలవడం - ఆమె మీద పుస్తకాలన్ని రీసెర్చ్ చేయటం మొత్తంగా చాలా హోం వర్క్ చేసాడు. ఇప్పుడు జెమిని గణేషన్ పాత్ర పోషిస్తున్న దుల్కర్ సల్మాన్ పాత్రలో నెగటివ్ షేడ్స్ చూపించాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పైగా తన పిల్లలను ఉన్నతంగా చదివించి మంచి కుటుంబాలకు ఇచ్చిన వివాహం చేసినా సావిత్రి గారు చివరి దశలో ఎందుకు అలాంటి స్టేజి అనుభవించారు అనేది ఇప్పటి యువతరానికి చెబుతారో లేదో. మోహన్ బాబు - ప్రకాష్ రాజ్ - విజయ్ దేవరకొండ ఇలా తారాగణం బాగానే సెట్ చేసుకున్న నాగ అశ్విన్ బాధాకరమైన కోణాలు స్పృశించడం లేదని తెలిసింది. వీలైనంతగా ఆవిడ మహానటిగా ఎదగడానికి దోహదం చేసిన వాటి మీద కథ రాసుకున్నట్టు తెలిసింది. అదే కనక నిజమైతే మహానటి సినిమాతో సావిత్రి జీవితంలోకి తొంగి చూడాలి అనుకునే వారి కోరిక నెరవేరడం కష్టమే.