కొడుకు మీద డ‌బ్బులు సంపాదించ‌ను

Update: 2018-05-03 10:20 GMT
స‌హాయ న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు... ఆ త‌ర్వాత నిర్మాత‌గా మారి అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ మీద కొన్ని సినిమాలు నిర్మించాడు. అయితే నిర్మాత‌గా అనుకున్నంత స‌క్సెస్ కాలేక‌పోయాడు నాగ‌బాబు. ఆయ‌న చివ‌ర‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో నిర్మించిన ‘ఆరెంజ్‌’ భారీ డిజాస్ట‌ర్ అయ్యి... నాగ‌బాబుకి ఆర్థిక క‌ష్టాల‌ను తెచ్చిపెట్టిన విష‌యం తెలిసిందే.

ఆ సినిమా త‌ర్వాత చాలా రోజులు సినిమాల నిర్మాణం జోలికి వెళ్ల‌ని నాగ‌బాబు... మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు మేన‌ల్లుడు బ‌న్నీ నటిస్తున్న ‘నా పేరు సూర్య‌’ సినిమాకి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఆయ‌న కుమారుడు వ‌రుణ్ తేజ్ కూడా వ‌రుస‌గా రెండు హిట్లు కొట్టి మంచి జోరుమీదున్నాడు. మ‌రి కొడుకుతో సినిమా తీయ‌కుండా... మేన‌ల్లుడి సినిమా ఎందుకు తీస్తున్న‌ట్టు అనే ప్ర‌శ్న ఎదురైంది నాగ‌బాబుకి. దానికి ఆయ‌న సూటిగా ‘నా కొడుకు రెండు స‌క్సెస్ లు సాధించాడు. ఇప్పుడు వాడికి చేతినిండా సినిమాలున్నాయి. అయితే వాడి స‌క్సెస్ వాడుకుని డ‌బ్బులు సంపాదించ‌డం నాకు ఇష్టం లేదు. అయితే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా వాడి సినిమాని కూడా నిర్మిస్తానేమో...’ అని స‌మాధానం చెప్పాడు జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జి నాగ‌బాబు.

ప్ర‌స్తుతం మెగా ప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ‘ఘాజీ’ ఫేం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ్యోమ‌గామిగా ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తున్న వ‌రుణ్ తేజ్‌... వెంకీతో క‌లిసి ‘ఎఫ్ 2’ అనే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ మ‌ల్టీస్టార‌ర్‌లోనూ న‌టిస్తున్నాడు.
Tags:    

Similar News