వెధవకి అబద్ధం చెప్పడం కూడా రాదు

Update: 2017-02-20 04:39 GMT
తన మేనల్లుడు సాయిధరమ్ గేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాగబాబు. తేజు బంగారం లాంటోడని.. అతడికి అబద్ధం చెప్పడం కూడా సరిగా రాదని వ్యాఖ్యానించాడు నాగబాబు. ఈ సందర్భంగా తేజుని ఆప్యాయంగా ‘వెధవ’ అని సంబోధించాడు నాగబాబు. సాయిధరమ్ కొత్త సినిమా ‘విన్నర్’ ఆడియో వేడుకలో నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

‘‘మావాడితో సినిమా చేసిన నిర్మాతలకు చాలా థ్యాంక్స్. మా మేనల్లుడు సాయిధరమ్ అంటే మాకెంతో ఇష్టం. అన్నయ్య చిరంజీవి.. తమ్ముడు పవన్ కళ్యాణ్ లకు కూడా తేజు అంటే చాలా చాలా ఇష్టం. లవబుల్ మేనల్లుడు వాడు. వాడిలో మాకు నచ్చేదేంటంటే.. వాడి తల్లి మీద వాడికున్న ప్రేమ. వాడి ఎనర్జీ లెవెల్స్.. పెర్ఫామెన్స్ అవన్నీ వేరు. మాటీవీ అవార్డు తీసుకున్నపుడు వాడు మా చెల్లెల్ని పిలిచాడు. నేను ఆ రోజు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. ఇదిరా అచీవ్ చేయాల్సింది జీవితంలో అనిపించింది. మా అమ్మంటే మాకు అంత ప్రేమ. అలాగే మా చెల్లెలంటే మా మేనల్లుడికి అంత ప్రేమ. అందుకే వాడంటే నాకు చాలా ఇష్టం. వాడు చాలా చిన్నప్పటి నుంచి ఇన్నోసెంట్. జెన్యూన్. అబద్ధం చెప్పడం కూడా రాదు వెధవకి. అంత నిజాయితీగా ఉంటాడు. అందుకే మేమందరం వాడిని అంతిష్టపడతాడు. నాకు చాలా సంతోషం కలిగిస్తున్న విషయం ఏంటంటే.. వాడు అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. విన్నర్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న టైటిల్. నాకు ఈ కథ ముందే తెలుసు. కాబట్టి కాన్పిడెంటుగా చెబుతున్నా.. ఇది సూపర్ హిట్టవుతుంది’’ అని నాగబాబు ముగించాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News