రొమాంటిక్ లవ్ స్టోరీస్ కి..ప్లేబాయ్ పాత్రలకు అక్కినేని హీరోలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు ఈ తరహా పాత్రలకు వన్నె తెచ్చారు. ఆయన అందించిన వారసత్వాన్ని తనదైన శైలి సెలెక్షన్ తో నాగార్జున దశాబ్ధాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. దాన్ని నాగ్ వారసులైన నాగచైతన్య - అఖిల్ మరో స్థాయికి తీసుకెళ్లాలని చాలా కాలంగా ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఆ ఆశల్ని ఇంతకుముందు వచ్చిన `భాయ్`(కింగ్ రొమాన్స్ టూహాట్).. రీసెంట్ గా వచ్చిన `మన్మథుడు-2` నాశనం చేశాయి. రొమాంటిక్ ప్లే బాయ్ పాత్రలంటేనే అక్కినేని హీరోలు భయంతో ఒణికిపోయేలా చేశాయి.
లేటు వయసులో నాగార్జున ప్లేబాయ్ గా నటించిన `మన్మథుడు-2` ఊహించని విధంగా ఫ్లాప్ అయిన విషయం తెలిసిదే. ఈ సినిమా ఇచ్చిన ఫలితంతో ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ షాక్ లో వుంది. నాగచైతన్య ను ఈ సినిమా ఫలితం మరింత భయాందోళనకు గురిచేస్తోందట. దీంతో ఇలాంటి పాత్రలో నటించాలంటే వెనకాడుతున్నాడట. చైతూ త్వరలో `సోగ్గాడే చిన్ని నాయన` సీక్వెల్ `బంగార్రాజు`లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్లేబోయ్ తరహా పాత్ర చేయాల్సి ఉండగా అందులో నటించడానికి చైతూ భయపడుతున్నట్టు తెలిసింది. దీంతో పాత్రని మార్చమని దర్శకుడికి సూచించారట.
చైతూ తమ్ముడు అఖిల్ కూడా `మిస్టర్ మజ్ను`లో ప్లే బాయ్ క్యారెక్టర్ చేయడం దాన్ని ప్రేక్షకులు రిజెక్ట్ చేయడం.. ఆ వెంటనే నాగ్ చేసిన `మన్మథుడు-2`ని దారుణంగా రిజెక్ట్ చేయడం చూసిన చైతన్య ప్లే బాయ్ క్యారెక్టర్ అంటేనే ఫికర్ అవుతున్నాడట. ఈ నేపథ్యంలో కల్యాణ్ కృష్ణ చైతూ కోసం ఆ క్యారెక్టర్ వరకూ మారుస్తాడా? లేక అదే కంటిన్యూ చేసి అక్కినేనీస్ కి సక్సెస్ చూపిస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే. అక్కినేనీస్ లోనే కలవరపాటా? అయితే ఎందుకు అలా? కింగ్ నాగార్జునను రొమాంటిక్ హీరోని చేసిన ఆ ఫ్యాక్టర్ వారసుల్లో ఉందా లేదా? అన్న చర్చా సాగుతోంది. అయితే నటవారసుల్లో దానిని బయటకు తీయగలిగేది దర్శకులు మాత్రమే. త్వరలోనే బంగార్రాజు సెట్స్ పైకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ప్రతిదీ అక్కినేని ఫ్యాన్స్ ని వేడెక్కిస్తోంది.