బాలీవుడ్ హిట్ మూవీ 2 స్టేట్స్ ను తెలుగులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. చేతన భగత్ రాసిన నవలను అదే పేరుతో కరణ్ జోహార్ హిందీలో తీయగా.. ఈ చిత్రంలో అర్జున్ కపూర్-ఆలియా భట్ లు జంటగా నటించారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి తెలుగు రైట్స్ కొనుగోలు చేసినట్లు అభిషేక్ పిక్చర్స్ కన్ఫాం చేసింది.
తెలుగు రీమేక్ లో అక్కినేని నాగ చైతన్య- సమంతలతో 2 స్టేట్స్ ను రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతు ఇప్పటికే సై అన్నాడనే టాక్ ఉండగా.. ప్రస్తుతం కొత్త సినిమాలను ఒప్పుకోవడం సమంతను ఒప్పిస్తాననే నమ్మకం అభిషేక్ పిక్చర్స్ అధినేత వెలిబుచ్చుతున్నాడు. వివి వినాయక్ దగ్గర 10ఏళ్ల పాటు అసిస్టెంట్ గా వర్క్ చేసిన వెంకట్ కుంచెం ను దర్శకుడిగా పరిచయం చేయనున్నారు. చైతు తెలుగు వ్యక్తి కావడం.. సమంత మళయాళీ కావడంతో.. రియల్ లైఫ్ కేరక్టర్లకు దగ్గరగా ఉండే ఈ పాత్రలకు ఈ జంట అయితేనే సరిగ్గా సెట్ అవుతారని నిర్మాత భావిస్తున్నాడట.
ఇక ఓ సినిమాకి రీమేక్ రైట్స్ విక్రయించడం కరణ్ జోహార్ కు ఇదే తొలిసారి. చాలా చిత్రాల హక్కులను అమ్మేందుకు ఆయన రిజెక్ట్ చేయగా.. అభిషేక్ పిక్చర్స్ మాత్రం ఈ విషయంలో విజయం సాధించింది. 55 లక్షల రూపాయలు ఇచ్చి ఈ రైట్స్ పొందినట్లు టాక్.