చై-సామ్ జోడీకి డిమాండ్ ఎక్కువేనబ్బా!

Update: 2019-03-08 04:48 GMT
అక్కినేని నాగ చైతన్య తాజా చిత్రం 'మజిలీ'  ఏప్రిల్ 5 న రిలీజ్ కు సిద్ధం అవుతోంది.  ఇప్పటికే ఇంట్రెస్టింగ్ టీజర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోందని వార్తలు వచ్చాయి.   నాన్ థియేట్రికల్ రైట్స్ మాత్రమే రూ. 12.5 కోట్లకు అమ్ముడు పోవడం ఈ సినిమాపై నెలకొన్న క్రేజ్ ను తెలుపుతోంది.

ఈ సినిమాను రూ. 20 కోట్ల మీడియం బడ్జెట్ లోనే నిర్మించడంతో బ్రేక్ ఈవెన్ కావడానికి మరో ఎనిమిది కోట్లు థియేట్రికల్ రైట్స్ ద్వారా రికవర్ అయితే చాలు.  కానీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తే ఎలాగైనా రూ.18 కోట్ల వరకూ థియేట్రికల్స్ రైట్స్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.  అంటే ఓవరాల్ గా 'మజిలీ' ప్రీ రిలీజ్ బిజినెస్ ముప్పై కోట్ల మార్క్ టచ్ చేస్తుందని.. నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ ఖాయమని అంటున్నారు.   నాగ చైతన్య ఈమధ్య నటించిన సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతున్నా ఈ క్రేజ్ ఏంటని కొంతమంది ముక్కు మీద వేలేసుకుంటున్నారు.  నిజానికి చైతు సినిమాకు ఈ బిజినెస్ ఎక్కువే.. అలా అని చైతు మార్కెట్ ను మాత్రం తక్కువ చేసే వీలు లేదు. ఎందుకంటే చైతు నటించే ప్రతి సినిమాకు మినిమం 20 కోట్ల వరకూ బిజినెస్ జరుగుతుంది.  ఒక్కోసారి క్రేజీ ప్రాజెక్ట్ ఐతే ఆ ఫిగర్ రూ.25 కోట్ల మార్క్ కూడా టచ్ చేస్తుంది.  

ఈసారి చైతుకు బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఆయన సతీమణి సమంతా ప్రెజెన్స్. దాంతో పాటుగా చై-సామ్ జోడీ మీద ఉన్న క్రేజ్.  దీంతో 'మజిలీ' సినిమా బిజినెస్ ఆ రేంజ్ లో జరుగుతోందని ఇన్సైడ్ టాక్.  మరి బిజినెస్ విషయంలో జోరు చూపిస్తున్న చై-సామ్ జోడీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సత్తా చూపిస్తారేమో వేచి చూడాలి.
Tags:    

Similar News