నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా ఇటీవల విడుదలై ఊహించిన విధంగా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కనీసం మొదటి రోజు కూడా ఈ సినిమా ఊహించినంత కలెక్షన్స్ అందుకోలేకపోయింది.
నాగచైతన్య కెరీర్ లో అత్యంత డిజాస్టర్ అయిన యుద్ధం శరణం సినిమా కంటే కూడా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం అందరిని ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఈ సినిమాకు మొదటి నుంచి కూడా పెద్దగా హైప్ అయితే క్రియేట్ కాలేదు.
వరుసగా విభిన్నమైన సినిమాలతో దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చాడు. కానీ అతని నుంచి ఇలాంటి స్లో సినిమాను ఎవరు ఊహించలేదు. ఇక ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇప్పుడు నాగచైతన్య తదుపరి ప్రాజెక్ట్ పై కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తోంది. అది కూడా థాంక్యూ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే రాబోతోంది.
థాంక్యూ సినిమా సమయంలోనే దర్శకుడు విక్రమ్ ఒక హారర్ కాన్సెప్ట్ లో దూత అనే వెబ్ సిరీస్ చేయాలని నాగచైతన్యతో చర్చించాడు. కాన్సెప్ట్ నచ్చడంతో థాంక్యూ సినిమా విడుదలకు ముందే ఆ ప్రాజెక్టును అమెజాన్ ప్రైమ్ తో కలిసి మొదలుపెట్టేశారు. ఒక విధంగా థాంక్యూ సినిమా పనులన్నీ పూర్తయిన తర్వాతనే విక్రమ్ దూత ప్రాజెక్టును మొదలు పెట్టాడు.
ఇక థాంక్యూ సినిమా తీవ్రంగా నష్టాలను కలుగజేయడంతో దర్శకుడు కొంత అప్సెట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఆ ప్రభావం దూత ప్రాజెక్టుపై పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాగచైతన్య వెబ్ సిరీస్ మొదటిసారి 45 కోట్లకు పైగా భారీ బడ్జెట్లో రాబోతోంది. పూర్తిగా ఎన్నో డిఫరెంట్ వెబ్ సిరీస్లోతో మరి కొంతమంది హీరోలు రాబోతున్నారు.
కాబట్టి ఆ పోటీలో సక్సెస్ రేట్ ఉంటేనే ఎంతో కొంత హైలెట్ అవుతుంది. కాకపోతే ఇది హారర్ కాన్సెప్ట్ కాబట్టి కొంత విభిన్నంగా హైలెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదేమైనా దూత కూడా మొదట పాజిటివ్ టాక్ అందుకుంటేనే ఆ తర్వాత జనాల ఫోకస్ పడుతుంది అని చెప్పవచ్చు. మరి థాంక్యూ ఒత్తిడిని ఎంతవరకు జయిస్తారో చూడాలి.