నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చిత్రంను చేస్తున్న విషయం తెల్సిందే. ఫిదా చిత్రం తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు శేఖర్ కమ్ముల తన మార్క్ మిస్ అవ్వకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ అవ్వడంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగింది. ఇటీవల ఈ చిత్రంలోని ఓయ్ పిల్లా పాట టీజర్ వచ్చింది.
టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగేలా ఆ పాట టీజర్ ఉంది. దాంతో దర్శకుడు శేఖర్ కమ్ములకు నాగచైతన్య స్టైలిష్ కళ్లద్దాలను బహుమానంగా ఇచ్చాడు. ఆ విషయాన్ని శేఖర్ కమ్ముల సోసల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. నాగచైతన్య నుండి ఆ గిఫ్ట్ అందుకున్న ఫొటోను మరియు కళ్ల జోడు పెట్టుకున్న ఫొటోలను షేర్ చేసిన శేఖర్ కమ్ముల త్వరలో టీజర్ రాబోతుంది మరో గిఫ్ట్ ను రెడీ చేసుకో చైతూ అంటూ ఫన్నీగా పోస్ట్ పెట్టాడు.
నాగచైతన్య మజిలీ మరియు వెంకీ మామ చిత్రాలతో జోరు మీద ఉన్నాడు. వరుసగా ఈ చిత్రం కూడా సక్సెస్ అయితే ఆయన క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం. ఈ చిత్రంతో నాగచైతన్యను ఓవర్సీస్ ప్రేక్షకుల వద్దకు శేఖర్ కమ్ముల తీసుకు వెళ్లబోతున్నాడు. చైతూ నటించిన గత చిత్రాలు ఓవర్సీస్ లో పెద్దగా వసూళ్లు రాబట్టలేక పోయాయి. కాని ఈ చిత్రం మాత్రం ఖచ్చితంగా మంచి వసూళ్లను నమోదు చేయడం ఖాయంగా నమ్ముతున్నారు. అందుకే ఓవర్సీస్ రేటు భారీ మొత్తం పలికినట్లుగా సమాచాం అందుతోంది. సమ్మర్ ఆరంభంలోనే సందడి చేసేందుకు లవ్ స్టోరీతో వీరు రెడీ అవుతున్నారు.