టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫిల్మీ నేపథ్యం లేకపోయినా తనకంటూ ఓ ఐడెంటీటీని క్రియేట్ చేసుకుని మార్కెట్ లో వెలిగిపోతున్నాడు. టాలీవుడ్ వారసుల నుంచి ఎంత కాపిటీషన్ ఉన్నా ఆ పోటీతో పనిలేకుండా తనదైన మార్క్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదితో నాని పరిశ్రమకు వచ్చి 13 ఏళ్లు పూర్తయింది. ఇన్నేళ్లలో 40 చిత్రాలకు పైగా నటించాడు. అయితే ఇదే సమయంలో నానికి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చినట్లు తెలిపాడు. మిస్టర్ పర్ పెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న `లాల్ సింగ్ చద్దా`లో ఓ కీలక పాత్రకు నాని తీసుకోవాలనుకున్నారుట.
నేరుగా అమీర్ ఖాన్ నానీకి ఫోన్ చేసి నటించాల్సిందిగా కోరారుట. కానీ నాని మాత్రం సున్నితంగా అవకాశాన్ని తిరస్కరించినట్లు తెలిపాడు. అప్పుడు తను తెలుగు సినిమాలతో బిజీగా ఉండటం కారణంగా డేట్లు సర్ధుబాటు చేయలేక వచ్చిన గొప్ప అవకాశాన్ని వదులకున్నట్లు చెప్పాడు. నానికి ఆఫర్ చేసిన పాత్రలోనే అక్కినేని నాగచైతన్య నటిస్తున్నాడు. అలా నాని వదులు కోవడంతో చై ఆ పాత్రలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ నాని బిగ్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నట్లే అయింది. అమీర్ సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలోనే విపరీతమైన క్రేజ్. అతనితో కలిసి నటించడానికి బాలీవుడ్ మీడియం హీరోలెందరో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్లెవరికీ రాని అవకాశం నానీకి వచ్చింది. పిలిచి ఛాన్సిస్తే కాల్షీట్ల సమస్యతో వదులుకున్నాడు.
అయితే తాజాగా నాని బాలీవుడ్ సినిమాలపై తన ఆసక్తిని వెల్లడించాడు. ఓ ఆరు నెలలు పాటు బాలీవుడ్ కి టైమ్ కేటాయించి మంచి అవకాశాలు వస్తే సినిమాలు చేస్తానని తెలిపాడు. ఈ గ్యాప్ లో తెలుగు సినిమాలు వచ్చినా వదిలేస్తానని స్పష్టం చేసాడు. అంటే నాని హిందీ సినిమాలపైనా దృష్టి సారించే ప్లాన్ తో ఉన్నారని దీనిని బట్టి క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలంతా పాన్ ఇండియా చిత్రాలపై దృష్టి పెడుతోన్న సంగతి తెలిసిందే. నాని నటించిన తాజా చిత్రం `టక్ జగదీష్` ఓటీటీలో రిలీజ్ అయింది. తదుపరి శ్యామ్ సింఘరాయ్ రిలీజ్ కి రావాల్సి ఉంది.