అక్కినేని నాగ చైతన్య - సమంతా ఇద్దరూ కలిసి 'మజిలీ' అనే సినిమాలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరలో విడుదలకు సిద్దం అవుతుండడంతో ప్రమోషన్స్ కూడా మొదలుపెటారు. రీసెంట్ గా ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూ లో చై-సామ్ జంట సరదాగా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు.
చై-సామ్ జోడీ ఈమధ్యే మొదటి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్నారు. వైవాహిక జీవితం గురించి చైతు మాట్లాడుతూ.. మొదటి ఏడాదిలో ఎగ్జైట్ మెంట్ ఉండేదని ఇప్పుడు అంతా రొటీన్ అని సరదాగా అన్నాడు. సమంతా ఎన్ని గంటలకు బయటకు వెళ్తోంది.. ఎప్పుడు వస్తోందని ట్రాక్ చేస్తూ ఉంటానని తెలిపాడు. అంతే కాదు సమంతా తనపట్ల పొసెసివ్ గా ఉంటుందని కూడా చెప్పాడు. కానీ సామ్ మాత్రం చైతు చెప్పేవాటికి ఒప్పుకోలేదు. పైగా చైతు బోరింగ్ మనిషి అని ఒక సెటైర్ కూడా వేసింది. అంతా సరదాగానే లెండి. అంటే ఈ లెక్కన టాలీవుడ్ క్యూట్ కపుల్ ఇప్పుడిప్పుడే నిజమైన భార్యభర్తలు అవుతున్నారన్నమాట.
'మజిలీ' ఏప్రిల్ 5 న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో సమంతాతో పాటుగా దివ్యాన్ష కౌశిక్ అనే మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి దర్శకుడు శివ నిర్వాణ.