చైతూ బెస్ట్‌ లవర్‌ కాదు.. బెస్ట్‌ భర్త : సమంత

Update: 2019-04-04 01:30 GMT
నాగచైతన్య, సమంతలు పెళ్లికి ముందు మూడు సినిమాల్లో నటించారు. 'ఏమాయ చేశావే', 'మనం' చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. పెళ్లి తర్వాత వీరిద్దరు నటించబోతున్న సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్‌ సంవత్సరం పాటు ఎదురు చూశారు. ఎట్టకేలకు మరో రెండు రోజుల్లో 'మజిలీ' చిత్రంతో ఈ అక్కినేని జంట ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇద్దరం కలిసి నటించాలని అనుకోలేదు, కాని మా కోసం కథ వెదుక్కుంటూ వచ్చిందని ఈ జంట అంటున్నారు. 'మజిలీ' సినిమా ప్లాన్డ్‌ గా చేసింది కాదని, కాకతాళీయంగా మేమిద్దరం కలిసి నటించామని చెబుతున్నారు.

సినిమా విడుదల దగ్గర పడ్డ నేపథ్యంలో భార్య భర్తలు ఇద్దరు కూడా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ బిజీగా ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇద్దరు కూడా పలు విషయాలపై మాట్లాడారు. ఆ సమయంలోనే సమంత తనకు నాగచైతన్య భర్తగానే ఇష్టం అని, లవర్‌ గా కంటే భర్తగానే చైతూను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. భర్తగా చైతూ ఈజ్‌ బెస్ట్‌ అంటూ సమంత కాంప్లిమెంట్‌ ఇచ్చింది. లవర్‌ గా ఉన్న సమయంలో సమంతతో చైతూ అంత ఫ్రీగా ఉండేవాడు కాదేమో, అందుకే చైతూ భర్తగానే తనకు ఎక్కువ ఇష్టం అంటోంది.

సమంత గురించి చైతూ మాట్లాడుతూ.. సామ్‌ అన్ని విషయాల్లో కూడా చాలా బ్యాలన్స్‌ గా ఉంటుంది. ఆమె తీసుకునే నిర్ణయాలు కూడా అనాలోచితంగా ఉండవు. ప్రతి ఒక్క విషయంలో ఆమె పూర్తి క్లారిటీగా ఉంటుందని అన్నాడు. ఇక సమంత తన జీవితంలో తీసుకున్న బెస్ట్‌ నిర్ణయాల్లో చైతూను పెళ్లి చేసుకోవడం ఒక బెస్ట్‌ నిర్ణయంగా చెప్పుకొచ్చింది.

సినిమాలోని కథకు తమ రియల్‌ లైఫ్‌ కు అసలు సంబంధం లేదని, రెగ్యులర్‌ గా ప్రేమ కథలు చేయకుండా ఇలాంటి విభిన్నమైన కథను చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ చిత్రంను చేయడం జరిగిందని చైతూ మరియు సామ్‌లు చెప్పుకొచ్చారు.
    

Tags:    

Similar News