తన కలల చిత్రమేమో అన్నట్టుగా పట్టుబట్టి మరీ ప్రేమమ్ రీమేక్ సెట్ చేశాడు నాగచైతన్య. మలయాళంలో విడుదలై విజయం సాధించిన ప్రేమమ్ ఆయనకి అంతగా నచ్చింది. సినిమా చూసిన వెంటనే ఎలాగైనా ఈ సినిమా మనం చేయాల్సిందే అని తన నిర్మాతలకి చెప్పాడట. దీంతో హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ ప్రేమమ్ రీమేక్ రైట్స్ కొని పనులు మొదలుపెట్టింది.
నిజానికి ప్రేమమ్ ప్లేస్ లో నాగచైతన్య వేరే సినిమా చేయాల్సింది. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి కొత్త కథ తయారు చేసుకొని చైతూకి వినిపించాడు. అది కూడా చైతూకి బాగా నచ్చింది. ఇక సెట్స్ పైకి వెళదాం అనుకొనేలోపు అనుకోకుండా ఆయన ప్రేమమ్ ని చూడటం, దానిపై మనసు పడటంతో కొత్త కథ తర్వాత చూద్దాం, ఇప్పుడైతే ప్రేమమ్ చేద్దాం అని చందు మొండేటిని ఒప్పించాడు. ఆయనతోనే ప్రేమమ్ రీమేక్ స్క్రిప్టు రాయించాడు. ఆ చిత్రం శనివారం హైదరాబాద్ లో కొబ్బరికాయ కొట్టుకుంది. అఖిల్ అక్కినేనితో పాటు సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్న అనుపమ - కథానాయకుడు నాగచైతన్య - దర్శకుడు చందు మొండేటితో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రేమమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన శ్రుతిహాసన్ - అనుపమలతో పాటు ఆయేషా శర్మ మరో కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నామని నాగచైతన్య ట్వీట్ చేసి వెల్లడించారు.