మజ్ను డైరెక్టర్ తో అక్కినేని హీరో

Update: 2017-11-10 04:23 GMT
అక్కినేని నాగచైత్య ప్రస్తుతం సవ్యసాచి మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు తన ఇతర ప్రాజెక్టులను కూడా ఫుల్ స్పీడ్ లో ఫైనలైజ్ చేసుకుంటున్నాడు. మారుతితో ఓ చిత్రం చేయనున్న చైతు.. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ విరించి వర్మకు కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది.

ఉయ్యాలా జంపాలా మూవీతో తన మార్క్ చూపించిన విరించి వర్మ.. తన మరుసటి చిత్రం మజ్ను స్టోరీని మొదట నాగచైతన్యకే వినిపించాడు. అయితే.. ఈ ప్రాజెక్టు ఓకే కాకపోవడంతో.. నానితో అదే కథను తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు తన లేటెస్ట్ స్టోరీని మళ్లీ చైతుకే వినిపించిన విరించి వర్మ.. ఈ యంగ్ హీరోను ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ దర్శకుడు చెప్పిన కథను ఆసాంతం ఆసక్తిగా విన్న చైతు.. కథ అద్భుతంగా ఉందని ప్రశంసించాడట. అయితే నెరేషన్ విషయంలో మాత్రం మరింతగా డెవలప్ చేయాల్సిందిగా సూచించాడట చైతు. విరించివర్మ- నాగ చైతన్యల కాంబినేషన్ దాదాపుగా ఖాయం అయిపోయినట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ ఈ ప్రాజెక్టు ఓకే అయితే.. చైతు హోమ్ బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే తెరకెక్కే అవకాశాలున్నాయి. అయితే.. ఈ ప్రాజెక్టు మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉండడంతో.. ఇద్దరూ మరికొన్ని సార్లు స్క్రిప్ట్ పై డిస్కషన్స్ చేయాలని డిసైడ్ అయ్యారట. స్టోరీని డెవలప్ చేయడానికి విరించి వర్మ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వినిపించకపోవడంతో.. దాదాపుగా ఈ ప్రాజెక్టు ఖాయమైనట్లే అనే టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News