RRR నిర్మాతతో చైతూ రోమ్ కామ్.. డైరెక్టర్ ఎవరంటే..?

Update: 2022-02-17 06:39 GMT
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ మధ్య కాలంలో నాలుగు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న యువ హీరో చైతూనే అనడంలో సందేహం లేదు. 'వెంకీమామ' 'మజిలీ' 'లవ్ స్టోరీ' వంటి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న చై.. ఇటీవల సంక్రాంతికి 'బంగార్రాజు' తో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇప్పుడు చైతన్య RRR నిర్మాతతో కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

'సెకండ్ హ్యాండ్' సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన కిశోర్‌ తిరుమల.. 'నేను శైలజ' చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రచయితగా వర్క్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్.. ఇప్పటి వరకు తెలుగులో 'ఉన్నది ఒకటే జిందగీ' - 'చిత్రలహరి' - 'రెడ్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

శర్వానంద్ - రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ఫిబ్రవరి 25న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో కిషోర్ తిరుమల మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. తదుపరి సినిమా నిర్మాత డీవీవీ దానయ్యతో ఉంటుందని.. హీరోగా నాగ చైతన్యను అనుకుంటున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని క్లారిటీ ఇచ్చారు.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాజమౌళి దర్శకత్వంలో దానయ్య నిర్మించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో చిరంజీవి - ప్రభాస్ వంటి పలువురు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నాగచైతన్య - తిరుమల కిశోర్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇకపోతే చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' అనే మూవీ చేస్తున్నారు. అమీర్ ఖాన్ తో కలిసి చేసిన 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. ఇదే క్రమంలో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం విక్రమ్ కె కుమార్ తో రూపొందించే ఓ హారర్ వెబ్ సిరీస్ లో చైతూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

 అలానే పరశురామ్ పెట్లా - విజయ్ కనకమేడల వంటి దర్శకులతో చైతూ వర్క్ చేయనున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో చై ఓ బైలింగ్విల్ చేస్తారని టాక్.
Tags:    

Similar News