డైరెక్టర్ మామధ్య గొడవలు పెట్టాడు: చైతు

Update: 2018-11-02 01:30 GMT
అక్కినేని నాగ చైతన్య - సమంతాల జంట టాలీవుడ్ లో ఉండే క్యూట్ కపుల్స్ లో ఒకటి అని మనం అనుకుంటాం.  కానీ ఫుల్ గా గొడవపడుతున్నామని చెప్తున్నాడు చైతు.  అదేంటి? మనమేమో క్యూట్ అంటుంటే చైతు హాట్ హాట్ గొడవలు అంటాడు? అదే ట్విస్ట్.  రియల్ కపుల్ క్యూట్ గానే ఉన్నారు.. రీల్ కపుల్ మధ్య మాత్రం ఫుల్లు గొడవలే.

అర్థం కాలేదా. ఇద్దరూ కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు కదా.  ఆ సినిమాలో డైరెక్టర్ ఇద్దరి పాత్రల మధ్య గొడవలు పెట్టాడట. సినిమాలో రీసెంట్ గా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న జంటగా ఒకరితో ఒకరు గొడవలు పడుతూ ఉన్నారట. "రియల్ లైఫ్ లో మాకు అలాంటి గొడవలేమీ లేవు.. దాంతో ఆ సీన్స్ లో నటించాల్సి వస్తోంది. మిగతా సీన్స్ లో రియల్ లైఫ్ లో మేమెలా ఉన్నామో ఆలానే చేస్తున్నాం" అని చెప్పుకొచ్చాడు.

ఇద్దరం కలిసి సినిమా చేస్తున్నప్పటికీ కలిసి ఒకే కారులో షూటింగ్ కు వెళ్ళడం లేదని చెప్పాడు. తనేమో త్వరగా రెడీ అవుతాడట కానీ సామ్ రెడీ అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందట. అందుకే విడివిడిగానే షూటింగ్ కు వస్తామన్నాడు. జస్ట్ కాంబినేషన్ కోసమే సినిమా చేయలేదని.. శివ నిర్వాణ చెప్పిన కథ ఇద్దరికీ నచ్చడంతో చేస్తున్నామని తెలిపాడు. ఇక టైటిల్ గురించి క్లారిటీ ఇస్తూ మజిలీ అనే టైటిల్ వర్కింగ్ టైటిల్ మాత్రమేనని.. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదని.. డైరెక్టర్ వేరే టైటిల్స్ ను వెతుకుతున్నాడని తెలిపాడు.


Tags:    

Similar News