నెలన్నర తేడాలోనే అక్కినేని నాగచైతన్య రెండు సినిమాలు రిలీజ్ చేసేశాడు. రెండు సినిమాలకు మంచి టాక్ చెప్పుకోవాల్సిన విషయం. దసరాకి వచ్చిన ప్రేమమ్.. గతవారంలో రిలీజ్ అయిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలతో.. చైతు మరో రెండు మెట్లు ఎక్కేశాడని చెప్పాలి.
అయితే.. ఈ సినిమాల కలెక్షన్స్ చూస్తే ఓ విషయం అర్ధమవుతుంది. ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నా.. కాసిన్ని డౌట్స్ కూడా ఉన్న ప్రేమమ్ మూవీకి తొలి రోజున రూ. 5.7 కోట్ల గ్రాస్.. రూ.3.5 కోట్ల షేర్ వచ్చింది. కానీ ఈ వారం రిలీజ్ అయిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి రూ. 3.9 కోట్ల గ్రాస్.. రూ.2 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. బోలెడంత పోటీ మధ్య వచ్చిన ప్రేమమ్ కంటే.. సోలో రిలీజ్ గా వచ్చిన మూవీకి వసూళ్లు తగ్గడం గమనించాలి. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన సాహసం కు టాక్ బాగానే ఉన్నా.. కలెక్షన్స్ సగం మాత్రమే రావడం ఆశ్చర్యకరం.
ఇదంతా పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ అంటున్నాడు నాగచైతన్య. అయితే.. కలెక్షన్స్ స్టడీగా ఉండడంతో.. నిలకడగా ఆడుతుందని.. లాంగ్ రన్ కు అవకాశం ఉన్న మూవీ అంటున్నాడు నాగచైతన్య. కొత్త నోట్లు అందుబాటులోకి ఇంకా రాకపోవడంతో.. కరెన్సీ కొరత కొనసాగుతుండడంతో.. కొత్త సినిమాలు రిలీజ్ కు జంకుతుండడంతో.. చైతు చెప్పినట్లు లాంగ్ రన్ కు అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/