ఏ మాయ చేశావే చిత్రంతో అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో తన మార్క్ సెట్ చేసుకున్నాడు. నాగార్జున తర్వాత రొమాంటిక్ రోల్స్ తను ఎంతగా సూట్ అవుతాడో చెప్పాడు. ఐదేళ్ల తర్వాత మళ్లీ అదే కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ కాగానే అంచనాలు పెరిగిపోయాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఏఆర్ రెహ్మాన్ సంగీతం అనగానే ఎక్స్ పెక్టేషన్స్ టాప్ రేంజ్ కి వెళ్లిపోయాయి.
సాహసం స్వాసగా సాగిపో టీజర్ విడుదలయ్యి నెలలు గడిచిపోయాయి. నిజానికి ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడా మూవీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం శింబు వివాదమే. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తుండగా, తమిళ వెర్షన్ లో శింబు హీరోగా చేస్తున్నాడు. కానీ బీప్ సాంగ్ వివాదం తర్వాత శింబు ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి. కోర్టుకు కూడా ఎక్కాల్సిన పరిస్థితి నెలకొనడంతో.. ఎక్కడా బైట కనిపించే పరిస్థితి కూడా శింబుకు లేదు.
ఈ ఎఫెక్ట్ తెలుగు వెర్షన్ పై కూడా కనిపిస్తోంది. టాలీవుడ్ లో ఈ మూవీని రైటర్ కోన వెంకట్ తో కలిసి నిర్మిస్తున్నాడు గౌతమ్ మీనన్. ఇతను కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉండడం, కోన కూడా శంకరాభరణం డిజాస్టర్ తో దెబ్బ తినడంతో.. సెపరేట్ గా తెలుగు వెర్షన్ ని కంప్లీట్ చేసే ఛాన్స్ లేకపోయింది. దీంతో టైటిల్ లో సాగిపో అని పెట్టినా, షూటింగ్ మాత్రం సాగడం లేదు. చైతూ కూడా ఇప్పుడు మజ్నుని తప్ప దీన్ని పట్టించుకోవడం లేదు.