గత కొన్ని రోజులుగా "సమంత మంతం మార్చుకుంది" అని కొన్ని ఫోటోలు సోషల్ నెట్ వర్క్స్ లోనూ, వెబ్ మీడియాల్లోనూ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకూ క్రీస్టియన్ గా ఉన్న సమంత - చైతూ తో పెళ్లికోసం హిందూగా మారుతుందని, ఆమేరకు కొన్ని పూజలు చేసి - సంప్రదాయాల ప్రకారం నాగార్జున దగ్గరుండి మరీ సమంత మతం మార్పించాడని రకరకాల గాసిప్పులు హల్ చల్ చేశాయి. అయితే ఈ విషయాలపై తాజాగా నాగ చైతన్య స్పందించాడు. సమంత మతం మార్చుకోవడంపైనా, అందుకు రుజువులుగా చూపిస్తున్న ఫోటోలపైనా చైతూ క్లారిటీ ఇచ్చాడు.
సమంత మతం మార్చుకున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదనిం, తమకు ఆ అవసరం లేదని క్లారిటీ ఇచ్చాడు నాగ చైతన్య. సమంత మతం మార్చుకున్నట్లు ప్రచారమవుతున్న ఫోటోలు అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన మామూలు పూజకు సంబందించినవే అని చైతూ చెప్పాడు. ఇంకా ఈ విషయాలపై మాట్లాడిన చైతూ... "అన్నపూర్ణ స్టూడియోలో నాన్నగారు ఏదో పూజ చేసుకుంటుంటే... సరిగ్గా అదే సమయానికి మేమిద్దరం వెళ్లాం.. దాంతో ఎలాగూ వచ్చారు కదా అని మమ్మల్ని కూడా పూజలో కూర్చోమన్నారు నాన్నగారు. దాంతో ఇద్దరం పూజలో కూర్చున్నాం. అంతే తప్ప అవేమీ మా నిశ్చితార్థం ఫోటోలు కావు - సమంత మతం మార్చుకున్నవి అసలే కాదు" అని చెప్పాడు.
అలాగే తనకు ఏ మతమైనా ఓకే అని.. వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించడం - గౌరవించడం చేస్తాను తప్ప, మతం మార్చుకోమనడమో - మరొకటో వంటి కండిషన్స్ పెట్టనని అని మాగ్జిమం క్లియర్ గా చెప్పేశాడు చైతూ. ఇక తాను సమంత ప్రేమలో ఉన్న విషయం తమ రెండు కుటుంబాల్లో అందరికీ తెలుసని చెప్పిన చైతూ... వచ్చే ఏడాది బంధుమిత్రుల సమక్షంలో తమ పెళ్లి జరగబోతుందని అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/