చిన్నారి ప్రాణం నిలబెట్టిన చైతూ

Update: 2015-07-13 01:31 GMT
మన హీరోలు తెర మీద మాత్రమే కాదండీ.. అప్పుడప్పుడూ నిజజీవితంలోనూ హీరోలుగా మారుతుంటారు. ఆ మధ్య పవన్‌ కళ్యాణ్‌ ఖమ్మం వెళ్లి కేవలం తన ప్రెజెన్స్‌తో ఓ అమ్మాయి అనారోగ్యం నుంచి కోలుకోవడానికి కారణమయ్యారు. ఇంకొందరు హీరోలు అవసరానికి సాయం చేసి ప్రాణాలు నిలబెట్టిన సందర్భాలున్నాయి. ఆ కోవలోనే నాగచైతన్య ఇప్పుడు ఓ చిన్నారి ప్రాణం నిలబెట్టాడు.

సమంత సపోర్ట్‌తో నడిచే ప్రత్యూష సపోర్ట్‌ సంస్థ చిన్నపిల్లల ప్రాణాలు నిలబెట్టడానికి తోడ్పడుతుంటుందన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్లో ఈ సంస్థ చేపట్టే కార్యక్రమాల గురించి తరచుగా ట్వీట్లు పెడుతుంటుంది సమంత. చిన్నారులెవరైనా ప్రాణాపాయంలో ఉంటే ట్విట్టర్లో షే,ర్‌ చేస్తుంటుంది. అలా కొన్నాళ్ల కిందట పూర్ణిమ అనే ఓ చిన్నారి చెస్ట్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు వివరించింది. పూర్ణిమ అనే ఆ చిన్నారికి హార్ట్‌ సర్జరీ కూడా చేశారు.

ఐతే మందులకు భారీగా డబ్బులు అవసరమయ్యాయి. ఆ మందులు వాడకుంటే ప్రాణాలు నిలిచే పరిస్థితి లేదంటూ ఫండ్స్‌ కోసం ప్రత్యూష ఫౌండేషన్‌ అప్పీల్‌ ఇచ్చింది. ఈ సంగతి తెలిసిన నాగచైతన్య ఆ చిన్నారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేశాడు. ఆ సాయం పూర్ణిమకు ఎంతో ఉపయోగపడి.. ఇప్పుడా పాప సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఆ ప్రాణం నిలవడంలో తన పాత్ర తెలిసి చైతూ ఎంత సంతృప్తిగా ఉంటాడో. ఇలాంటి సంతృప్తి కోసం హీరోలందరూ ముందుకొస్తే బాగుంటుంది.
Tags:    

Similar News