టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత గతేడాది అక్టోబర్ లో తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లు తిరక్కుండానే విడాకులు తీసుకోవడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇది జరిగి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వీరి బంధం గురించి తరచూ ఏదొక వార్త వినిపిస్తూనే ఉంది.
విడాకులు తీసుకోవడం పై ఇప్పటికే చై-సామ్ స్పందించారు. అలానే ఇటీవల 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో చైతన్య తో విడిపోవడం గురించి సామ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరి మధ్య ఏదో పెద్ద గొడవే జరిగిందనుకునేలా ఆమె సమాధానమిచ్చింది. చైతూ మాత్రం 'బంగార్రాజు' ప్రమోషన్స్ లో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇద్దరం హ్యాపీగా ఉన్నాం అని చెప్పాడు.
డివోర్స్ గురించి సమంత ఎలాంటి సంకోచాలు లేకుండా మాట్లాడుతుండగా.. నాగచైతన్య మాత్రం ఎప్పటిలాగే మౌనం వహిస్తూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అయితే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ విడాకుల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చైతూ.
బాలీవుడ్ డెబ్యూ 'లాల్ సింగ్ చడ్డా' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగచైతన్య.. ఇప్పుడు సమంత దారి సమంత దే.. నా దారి నాదే.. ఇంతకుమించి ఈ విషయంలో చెప్పాల్సిందేమీ లేదని స్పష్టం చేశాడు. తన వ్యక్తిగత జీవితం గురించి అందరూ మాట్లాడుకోవడం చాలా అసహనం కలిగిస్తోందని పేర్కొన్నారు.
ఒక నటుడిగా తన నటనా జీవితం గురించే అందరూ మాట్లాడుకోవాలని కోరుకుంటానని.. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందని.. పర్సనల్ అని ఎందుకు అంటామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని చైతూ అన్నారు. "సినీ జీవితం కంటే వ్యక్తిగత జీవితమే పెద్ద హెడ్ లైన్ గా మారిపోతోంది. సినీ రంగంలో నేను సాధించిన దాని కంటే పర్సనల్ లైఫ్ గురించే మాట్లాడటం చాలా చికాకు కలిగించే అంశం'' అని పేర్కొన్నారు.
దురదృష్టం ఏమిటంటే సినిమా రంగంలో వ్యక్తిగత జీవితం కూడా వార్తా వస్తువే అవుతుంది అని తెలిపారు. ఈ విషయం గురించి ఏమని చెప్పాలనుకున్నామో వాటిని ఓ ప్రకటన రూపంలో సంయుక్తంగా చెప్పేశామని.. ఏదైమైనా మీడియాకు సమాచారం ఇచ్చే జీవితంలో ముందుకెళ్లానని చైతన్య చెప్పారు. ఈ ఘటన తర్వాత సామ్ మరో ముందడుగు వేసిందని.. తాను కూడా తన పని తాను చేసుకుంటూ సాగిపోతున్నానని అన్నారు.
ఇప్పుడు ఎవరి దారి వారిదే.. ఇంతకుమించి ఈ విషయంలో ప్రపంచానికి తానేం చెప్పాలనుకోవడం లేదని నాగచైతన్య స్పష్టం చేశారు. ఇప్పుడు తన విడాకులపై వచ్చే పుకార్లన్నీ తాత్కాలికమైనవని.. వాటిపై స్పందిస్తే మరిన్ని వార్తలు పుట్టుకొస్తాయని.. కాబట్టి తాను ఈ విషయం గురించి మాట్లాడనని చై చెప్పుకొచ్చారు.