మంచి కాఫీలాంటి సినిమాలను రూపొందించే శేఖర్ కమ్ముల తన కొత్త సినిమాను అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిస్తారని ఈమధ్యే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇప్పుడు కన్ఫాం అయింది. ఈ విషయాన్ని చైతు స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.
"నా కెరీర్ మొదటి నుంచి నేను పని చేయాలని ఎదురు చూస్తున్న దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. ఆయనతో ఫైనల్ గా సినిమా ఫిక్స్ అయింది. మరో బ్యూటిఫుల్ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ గారు నిర్మిస్తారు. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. టైమ్ బాగుంది.. మీ అందరి సపోర్ట్ కు కృతజ్ఞతలు. #NC20" అంటూ ట్వీట్ చేశాడు.
చైతు తన ట్వీట్ లో సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపినా ఆగష్టు ఫస్ట్ వీక్ నుండే రెగ్యులర్ షూట్ మొదలు పెడతారని అంటున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. చైతు - సాయి పల్లవి జోడీ కట్టడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే చైతు ప్రస్తుతం మేనమామ వెంకటేష్ తో కలిసి 'వెంకీమామ' చిత్రంలో నటిస్తున్నాడు'. శేఖర్ కమ్ముల సినిమా కంటే ముందే 'బంగార్రాజు' సెట్స్ మీదకు వెళ్ళాల్సి ఉంది కానీ ఇప్పుడు వెనక్కు జరిగినట్టుంది.