ప్రేమమ్ లో లుంగీతో చైతు రచ్చ

Update: 2016-02-22 05:30 GMT
మలయాళ ప్రేమమ్ ను తెలుగులోనూ అదే పేరుతో అక్కినేని నాగచైతన్య రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ కి ఉన్న ప్రత్యేకతల్లో.. హీరో లుంగీ లుక్ కూడా ఒకటి. నివిన్ పౌలీ లుంగీ స్టైల్ అక్కడ బాగా పాపులర్ అయింది. అయితే అదే స్టైల్ ని తెలుగులో తీసుకోవడం లేదని.. ముందే చెప్పేశాడు దర్శకుడు చందూ మొండేటి.

తన ఫ్రెండ్స్ తో కలిసి హీరో లుంగీతో కాలేజ్ కి వెళ్లే సీన్స్ అందులో ఉంటాయి. అక్కట నేటివిటీకి అది సరిపోతుంది కానీ.. ఇక్కడలాంటి సీన్స్ యాక్సెప్ట్ చేయలేం. అందుకే ఆ సీన్స్ ని మార్చారు. అలాగని చైతూని లుంగీ లుక్ లో చూపించడం మాత్రం మానడం లేదట. ఓ సన్నివేశంతలో చైతూ లుంగీతో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తాడని అంటున్నారు. ఒరిజినల్ ప్రేమమ్ లో అయితే.. హీరో కేరక్టరైజేషన్ లో ఈ లుంగీ కూడా కీలకంగా ఉంటుంది. కానీ ఇక్కడ జస్ట్ ఇదో సర్ ప్రైజ్ ఎలిమెంట్ గానే తీసుకుంటున్నారట.

నాగ చైతన్య ఇప్పటివరకూ లుంగీతో ఆన్ స్క్రీన్ పై కనిపించలేదు. అసలు లుంగీతో ఎక్కడా కనిపించలేదు కూడా. రీసెంట్ గా విడుదలైన తండ్రి నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన కోసం సాంప్రదాయ పంచెకట్టుతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడంతే. అసలు ఇలా లుంగీతో చైతూని చూపించడం కొత్తగా ఉంటుంది కాబట్టి.. ఫ్యాన్స్ ని థ్రిల్ చేసేలా ఈ సీన్ ప్లాన్ చేశారట. సినిమాలో కూడా ఈ సన్నివేశం కీలకంగా ఉండేలా జాగ్రత్త పడ్డాడట దర్శకుడు. అయితే.. ఇంకా ఈ సన్నివేశాన్ని పిక్చరైజ్ చేయలేదని చెబుతోంది తెలుగు ప్రేమమ్ యూనిట్.
Tags:    

Similar News